
తన సినిమాలకు హీరోయిన్ల ద్వారా పబ్లిసిటీ చేయించడం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ‘అత్తారింటికి దారేది’ సినిమా నుండి పరిపాటిగా మారిపోయింది. పవన్ లాంటి హీరోను పెట్టుకుని కూడా, ‘అత్తారింటికి దారేది’ టైటిల్ ను సమంత చేత చెప్పించిన త్రివిక్రమ్, చివరికి రిలీజ్ డేట్ కూడా సమంతే రివీల్ చేసింది. ఆ తర్వాత సినిమాలకు కూడా ఈ ‘మాటల మాంత్రికుడు’ ఇదే ఫార్ములాను కొనసాగించగా, తాజా పవన్ సినిమాకు కూడా అదే సెంటిమెంట్ తో ముందుకెళ్తున్నట్లుగా కనపడుతోంది.
మూడవ సినిమాతోనే పవన్ లాంటి హీరో పక్కన చేస్తుండడంతో ‘స్టార్ హీరోయిన్’ గుర్తింపు పొందే అవకాశం, త్వరగా వచ్చినట్లే భావించవచ్చు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పడి, సక్సెస్ అయితే అనుకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండకపోవచ్చు. ‘మజ్ను, కిట్టు గాడు జాగ్రత్త’ సినిమాలతో రెండు వరుస హిట్లు అందుకున్న ఈ బ్యూటీ, ‘హ్యాట్రిక్’ను అందుకుంటుందో లేదో చూడాలి. తాజా సమాచారం ప్రకారం అయితే వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల ఉండవచ్చని తెలుస్తోంది.
Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…
Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…