
ఈమధ్యకాలంలో చాలామంది డైరెక్టర్లు సరైన సక్సెస్ లేక యాక్టర్లుగా మారుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. సముద్రఖని, కే.ఎస్.రవికుమార్, వీర శంకర్, దేవీప్రసాద్ వంటి వాళ్లందరూ నటులుగా బిజీ అయిపోయి.. డైరెక్షన్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ లిస్ట్ లో రీసెంట్ గా చేసిన వ్యక్తి అనురాగ్ కశ్యప్. “గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్”తో బాలీవుడ్ ఇండస్ట్రీని మేల్కొల్పిన దర్శకుడు అనురాగ్. ఆ తర్వాత కూడా “అగ్లీ” అనే సినిమాతో భయం, జుగుప్స ఎలా ఉంటాయో రుచిచూపించాడు అనురాగ్.
“బాంబే వెల్వెట్”తో బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన తర్వాత కూడా “రమణ్ రాఘవ్ 2.0” కమ్ బ్యాక్ ఇచ్చిన అనురాగ్.. ఆ తర్వాత మాత్రం సరైన కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, క్రిటికల్ రెస్పాన్స్ కూడా అందుకోలేకపోయాడు. ఇక నటుడిగా తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తుండడంతో ఇక డైరెక్షన్ కి గుడ్ బై చెప్పేస్తాడేమో అనుకున్నారు చాలామంది.
అయితే.. వాళ్లందరి అంచనాలను తలకిందులు చేస్తూ, “బందర్” అనే సినిమా తెరకెక్కించి తన సత్తాను మరోమారు ఘనంగా చాటుకున్నాడు అనురాగ్ కశ్యప్. #MenToo కాన్సెప్ట్ ను అనురాగ్ కశ్యప్ తెరపై ప్రజంట్ చేసిన విధానం, జైల్ ఎపిసోడ్ ను రియలిస్టిక్ గా డీల్ చేసిన విధానాన్ని తెగ పొగిడేస్తున్నారు. బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది.
అయితే.. ఇంత సీరియస్ పాయింట్ ని డిస్కస్ చేసిన సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్ ఎందుకలా బిహేవ్ చేస్తుంది? ఆమె బ్యాక్ స్టోరీ ఏమిటి అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో మోటివ్ లో క్లారిటీ లేకుండాపోయింది. అందువల్ల క్లారిటీ మిస్ అయ్యింది కానీ.. ఓవరాల్ గా మాత్రం ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన సినిమా ఇది. మరి అనురాగ్ ఇప్పుడైనా డైరెక్టర్ గా సినిమాలు కంటిన్యూ చేస్తాడా? లేక మళ్లీ సినిమాల్లో నటిస్తూ టైమ్ వేస్ట్ చేస్తాడా? అనేది చూడాలి.
Chiranjeevi’s Sankranthi 2027 plans have taken a clear turn. Kaaka has officially locked January 13,…
An old video of Ranbir Kapoor refusing Ganesh prasad has resurfaced, and it has now…