
‘బాహుబలి’ సినిమా షూటింగ్ సమయంలోనే రెండవ పార్ట్ కు సంబంధించిన కొంత భాగం చిత్రీకరణ జరిపిన విషయం తెలిసిందే. ఇందులో అనుష్క పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ‘జీరో సైజు’ సినిమా చేసిన అనుష్క, లావు పెరిగి భారీకాయంగా మారింది. దీంతో ‘బాహుబలి 2’ షూట్ చేసే సమయానికి అనుకున్న విధంగా ‘అవుట్ ఫిట్’ ఇవ్వలేకపోవడంతో షూటింగ్ కు బాగా ఇబ్బంది కలిగిందనేది ట్రేడ్ టాక్.
దీని వలన ముందు భాగంలో తీసిన సన్నివేశాలకు, ప్రస్తుతం తీస్తున్న సన్నివేశాలకు ఆకారం విషయంలో పొంతన లేకపోవడంతో, ముందుగా చిత్రీకరించిన భాగాన్ని మళ్ళీ రీ షూట్ చేసారని, దీని నిమిత్తం దాదాపుగా మరో 20 కోట్లు అదనంగా బడ్జెట్ పెరిగిందనేది ఈ వార్తల సారాంశం. అయితే ‘క్వాలిటీ’ విషయంలో తను అనుకున్నది వచ్చేవరకు వెనక్కి తగ్గని రాజమౌళి, పెరిగిన బడ్జెట్ కంటే కూడా వచ్చిన అవుట్ ఫుట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…