
మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా ‘సైజ్ జీరో’ ప్రెస్ మీట్‌లో స్పందించింది. బరువు తగ్గేందుకు ఆపరేషన్ చేయించుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను కేవలం సరైన డైట్ ఫాలో అవ్వడం మరియు యోగా వల్లే బరువు తగ్గుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. పెరిగిన బరువులో ఇప్పటికే సగానికి పైగా తగ్గాను అని, త్వరలోనే మరింతగా బరువు తగ్గుతాను అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. అనుష్క త్వరలో ‘బాహుబలి’ రెండవ పార్ట్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. అందుకోసం మునుపటి రూపంను చాలా తక్కువ సమయంలో తెచ్చుకోవాల్సి ఉంది. మరో వైపు ఈమె మరో రెండు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఓకే చెప్పింది అంటూ వార్తలు వస్తున్నాయి.
Karthi’s Sardar 2 is arriving in theatres on September 11, with Annapurna Studios releasing the…
Botsa Satyanarayana is one of the senior leaders and crucial advisory members of the YSR…