
ED Investigations Into Multiple YSRCP-Linked Cases
నాడు అక్రమాస్తుల కేసుల మొదలు, వివేకానంద రెడ్డి హత్య కేసుతో సహా మద్యం కుంభకోణం, దాని రవాణా, తాజాగా కుంభకోణం, తాజాగా గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకన వరకు వరకు ప్రతీ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందంటూ ఈడీ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
“నాకు ప్రతిరోజూ రాత్రి ‘రాయల్ 90 ఎంఎల్’ పెగ్గు వేసుకొని పడుకోవడం తప్ప మద్యం రవాణా కుంభకోణం గురించి ఏమీ తెలియదు,” అని మాజీ మంత్రి అంబటి రాంబాబు కొద్ది రోజుల క్రితమే అన్నారు.
కానీ మొన్న ఈడీ విచారణకు హాజరైన తర్వాత “అవును.. నా అనుచరులిద్దరికీ లిక్కర్ రవాణా కాంట్రాక్ట్ ఇమ్మని నేనే సిఫార్సు చేశాను. నాడు ఓ మంత్రిగా నిత్యం అనేకమందికి అనేక సిఫార్సులు చేశాను. వాటిలో ఇదీ ఒకటి. పార్టీ నాయకుల కోసం సిఫార్సు చేయడం నేరం కాదు కదా? అంటూ కొత్త పలుకులు పలికారు.
అక్రమాస్తుల కేసులన్నీ పూర్తిగా డబ్బుకు సంబందించినవే కానీ వివేకా హత్య కేసులో కూడా రూ.50 కోట్లు చేతులు మారాయని ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుగుతోంది కదా?
తాజాగా గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో కూడా డబ్బు చేతులు మారిందంటూ ఈడీ రెండు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించింది.
అయితే ఈ కేసులన్నిటి సూత్రధారి, లబ్దిదారు ఒకరేననే దర్యాప్తు సంస్థల వాదనలు వింటున్నప్పుడు, ఇన్ని రకాల నేరాలు, వాటి నుంచి డబ్బు తీయడం మామూలు విషయం కాదనిపిస్తుంది. ఆర్ధిక నేరాలు ఇంత గొప్పగా మేనేజ్ చేయగలిగినప్పుడు, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఎందుకు మేనేజ్ చేయలేదనే సందేహం కూడా కలుగుతుంది.
ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నమోదు చేసిన తప్పుడు కేసులే అనే ఒకే ఒక్క మాటతో సింపుల్గా తేల్చిపడేయడమే కాకుండా, ఇలాంటి ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే లేదని చెప్పుకోవడం, మన దర్యాప్తు, న్యాయ వ్యవస్థల బలహీనతలపై ఉన్న నమ్మకంగానే చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు మారితే ఎంత పెద్ద కేసులైనా అటకెక్కి పోతుండటం ఈ ధైర్యానికి మరో కారణంగా కనిపిస్తోంది.
కనుక ఈ కేసులను హ్యాండిల్ చేస్తున్న వ్యవస్థలు ఇలాంటి నిసహాయ స్థితిలో ఉన్నంత కాలం, అవినీతిపరులను ప్రజలు ఎన్నుకుని అధికారం కట్టబెడుతున్నంత కాలం ఈ కేసులు ఇలాగే సాగిపోతుంటాయి. యదేచ్చగా అవినీతి జరుగుతూనే ఉంటుంది.
Nitesh Tiwari’s Ramayana is finally out now in theatres. Despite not hitting a big number…
All international travelers arriving to India now have to complete the Air Suvidha form. This…