
కానీ తాజా పరిణామాల తర్వాత యువరాజ్ సింగ్ వివాహం సందర్భంగా అనుష్క శర్మతో కలిసి దిగిన ఫోటోను తన ‘ఇన్ స్టాగ్రాం’ డీపీగా పెట్టుకున్నాడు. ఎంతో కాలం నుండి ప్రేమించుకుంటున్న ఈ జంట, చాలా రోజుల వరకు తన ప్రేమను ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయగా… ఇక లాభం లేదనుకున్నారేమో గానీ విరాట్ తన ప్రేమను బయటపెట్టారు. ప్రేమ పక్షుల్లా తిరుగుతుండడంతో కోహ్లీ విఫలమవుతున్నాడని క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేసిన సమయంలో, కోహ్లీ అనుష్కను వెనుకేసుకొచ్చాడు.
ఆ తరువాత “సుల్తాన్” సినిమాలో నటించొద్దన్నా అనుష్క పట్టించుకోలేదని వారిద్దరూ కొంత కాలం ఎడమొహం పెడ మొహంగా ఉన్నారు. అయితే అనుష్క శర్మ సోదరుడి జోక్యంతో మళ్లీ కలిసిపోయిన వారిద్దరూ ప్రేమ పక్షులైపోయారు. బహిరంగంగా తిరగకపోయినా… విదేశీ టూర్లు, ఫంక్షన్లు ఇలా వివిధ సందర్భాల్లో కలుసుకుని ఆనందం పంచుకుంటున్నారు. దీంతో అనుష్క శర్మ – విరాట్ కోహ్లిల పెళ్లి బాజాల సమయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…