
నాలుగైదు వారాలలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లకు నిరాకరిస్తే, పార్టీల పరంగా 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నామని టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
కనుక కూటమి ప్రభుత్వం ఏదో విధంగా బీసీలను ప్రసన్నం చేసుకోవడం ఖాయమని వైసీపీ గ్రహించినట్లే ఉంది. అందుకే ఈ నెల 16న విశాఖలో ఉత్తరాంద్ర బీసీ గర్జన సభ నిర్వహించేందుకు సిద్దమైంది.
కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పేరుతో మోసం చేస్తోందని వివరించేందుకే ఈ సభ అని అర్ధమవుతూనే ఉంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లు అమలు చేసిందా? ఓట్ల కోసం సంక్షేమ పధకాల పేరుతో డబ్బు ముట్టజెప్పడం కాకుండా బీసీల సంక్షేమం కోసం ఏమైనా చేసిందా?
అసలు వైసీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులకు సముచిత గౌరవం లభించిందా లేదా? నాడు ఐదేళ్ళపాటు సంక్షేమ పధకాలు అమలుచేసినా మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి ఎందుకు వెనకాడారు?అంటే సమాధానాలు అందరి కంటే బాగా వైసీపీ నేతలకే బాగా తెలుసు.
సరే! గతం గతః! కనీసం ఇప్పుడు ఈ సభలో టీడీపి కంటే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని వైసీపీ ధైర్యంగా చెప్పగలదా?
అయినా ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగవు… కనుక వైసీపీ గెలిచే అవకాశాలు తక్కువ. ఏకగ్రీవాలు జరిగితే ఎమ్మెల్యే టికెట్లు లభించవు.. అంటూ ముందే పార్టీలో అందరి గాలి తీసేసి, ఎలాగైనా ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని కోర్టులలో కేసులు వేసి మళ్ళీ ఈ గర్జనలు దేనికి?అవసరమా?
Poonam Kaur has once again brought Trivikram Srinivas into the conversation, but this time she…
Andhra Pradesh chief minister, Chandrababu Naidu is one of the senior most and reputed politicians…