
ప్రధానితో చర్చించిన వాటిలో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకి బకాయి నిధుల విడుదల, తెలంగాణ డిస్కంల నుంచి రావలసిన బకాయిల చెల్లింపులు. చివరికి విశాఖపట్నంలో మెట్రో రైల్ ఏర్పాటు, కడప స్టీల్ ప్లాంట్కి గనుల కేటాయింపు తదితర ప్రతిపాదనలన్నిటికీ ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారని సిఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి ఓకే ఒక పర్యటనతో ప్రధాని నరేంద్రమోడీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విశాఖకి మెట్రో రైల్ ప్రాజెక్టు సాధించగలిగితే నిజంగా ఆయన అభినందనీయుడే. అయితే ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరానికి నిధులు తదితర అంశాల గురించి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టిన్నట్లు చెపుతుంటే, ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా స్పందించారని సిఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రధాని నరేంద్రమోడీపైనే కత్తులు దూస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం చెపితే ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించేస్తారా?కృష్ణా గోదావరి నీళ్ళ పంపకాలకే చాలా పేచీలు పెడుతున్న సిఎం కేసీఆర్, విభజన హామీల ప్రకారం వేలకోట్లు విలువగల ఆస్తుల పంపకాలకు అంగీకరిస్తారని ఎలా అనుకోగలం?
సిఎం జగన్ ఢిల్లీ పర్యటనతో ఏం సాధించారో ఒకటి రెండు రోజులలో కేంద్ర ప్రభుత్వం చేసే ప్రకటనలతో లేదా విడుదల చేసే నిధులతో ఎలాగూ స్పష్టత వస్తుంది. అప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఎంత సానుకూలంగా స్పందించారో అందరికీ అర్దం అవుతుంది.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…