Telugu

హనీ ఈజ్ ది బెస్ట్ అని చిటికెలు వేసుకొంటే సరిపోదు.. ఏదీ అభివృద్ధి ?

పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఓ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేసుకోవచ్చో తెలుసుకొనేందుకు తెలంగాణ రాష్ట్రం మన కళ్లెదుటే ఉంది. అదే.. చిత్తశుద్ధి, దూరదృష్టి లేకుంటే ఎంత దయనీయంగా ఉంటుందో తెలుసుకొనేందుకు పక్కనే మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇంతకాలం కలిసి ఉండి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఏపీ, తెలంగాణలలో ఈ తేడా ఇప్పుడు ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణలో అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, పార్కులు, పచ్చదనం కనిపిస్తుంటే, ఏపీలో అధికార పార్టీ నేతల బూతులు, మూడు రాజధానుల పేరుతో ఆందోళనలు ఎప్పుడు చూసినా రాజకీయాలే కనిపిస్తుంటాయి.

ADVERTISEMENT

ఒకప్పుడు ట్విట్టర్‌ వంటి సోషల్ మీడియా పరిశుభ్రంగానే ఉండేది కానీ ఎప్పుడైతే దానిలోకి వైసీపీ నేతలు ప్రవేశించారో అదీ మురికి కంపు కొడుతోందిప్పుడు. దానిలో వైసీపీ నేతల తిట్లు, బూతు పురాణాలు ఎంతగా మితిమీరిపోయాయంటే ఆనాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని నిషేధించినట్లే ఏదో రోజు వైసీపీ నేతలని కూడా సోషల్ మీడియా నిషేధించే పరిస్థితి వస్తుందేమో?

అసలు వైసీపీకి ప్రజలు ఇంత భారీ మెజార్టీతో అధికారం అప్పగించినప్పుడు ఇంత నీచ రాజకీయాలు చేయవలసిన అవసరం ఏముంది? రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టవచ్చు కదా?కానీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రతీకార రాజకీయాలు, ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల కోసం తాపత్రయం ఎందుకు?

ప్రజలు దయతలిచి ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చినప్పుడు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మెప్పించి మరో ఛాన్స్ అడిగితే తప్పు లేదు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేసి ఎప్పటికీ తామే అధికారంలో ఉండిపోవాలనే దురాశతో మూడున్నరేళ్ళుగా రాజకీయాలు మాత్రమే చేస్తూ తమను ఎన్నుకొన్న ప్రజలు సైతం పశ్చాత్తాపపడేలా చేస్తున్నారు వైసీపీ నేతలు. చేయవలసిన పనులు చేయకుండా చేయకూడనివన్నీ చేసేస్తూ ఎఫ్2 సినిమాలో హీరోయిన్‌లాగా ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అని చిటికెలు వేస్తూ తమ తీరును తామే ప్రశంశించుకొంటున్నారు.

గత ఐదేళ్ళలో ప్రభుత్వం ఏం చేసిందని రాష్ట్ర ప్రజలు తప్పక బేరీజు వేసుకొనే ఓట్లు వేస్తారు. 2019లో అదే చేశారు. 2024 ఎన్నికలలో కూడా అదే చేస్తారు. గత ఎన్నికలలో టిడిపి అందరికీ తెలిసిన రాజకీయ కారణాల వలన అధికారం కోల్పోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నప్పటికీ టిడిపిని ప్రజలు పక్కనపెట్టినప్పుడు అసలు అభివృద్ధి అనే పదం కూడా పలకని వైసీపీకి ప్రజలు మళ్ళీ మరో ఛాన్స్ ఇస్తారా?అంటే ఇవ్వకపోవచ్చని అర్దం అవుతోంది.

ఈవిషయం వైసీపీ నేతలకీ బాగా అర్దమయినట్లే ఉంది అందుకే రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. కానీ ఇటువంటి వికృత ఆలోచనలు, నీచ రాజకీయాలు చేసేవారిని ఏవిదంగా వదిలించుకోవాలో ప్రజలకు బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు వదిలించుకొంటారు. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas, AA, Yash: Hindi Market Loyal to Films or Stars?

Baahubali, KGF, Pushpa, RRR and Kantara changed the rules of Indian cinema. They turned Prabhas,…

21 minutes ago

Pics: Nikita Flaunts Curves In Sexy Beach Outfits

Nikita Sharma is turning up the tropical heat with her latest breathtaking beach photoshoot, proving…

42 minutes ago