
AP rains bring floods after drought
ప్రకృతిని సైతం రాజకీయాలలోకి లాగుతూ వాటి పై కూడా రాజకీయ విమర్శలు చేసేందుకు వెనుకాడడం లేదు కొన్ని రాజకీయ పార్టీలు, కోణదృ నేతలు. వాతావరణంలో వస్తున్న మార్పులు కారణంగా దేశ వ్యాప్తంగా ఎలినో ప్రభావం కనిపిస్తుంది.
అయితే ఆ ఎలినో ని కూడా ఎల్లో నినో అంటూ వైసీపీ ప్రకృతి లో వచ్చే మార్పులను సీఎం చంద్రబాబు తో ముడిపెట్టి బాబు వస్తే వర్షాలు ఉండవు అంటూ ఆరోపణలు చేస్తుంది. బాబు – కరువు కవల పిల్లలు అంటూ ఎద్దేవా చేస్తుంది.
అయితే వైసీపీ విమర్శలకు అటు తెలంగాణలో కూడా బిఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్ లో కొంతంది నాయకులు స్వరం కలుపుతూ బాబు ని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఏపీలో నిన్నటి వరకు ఎలినో ప్రభావం తో ఎండిన చెరువులు ఇప్పుడు బంగాఖాతంలో పడిన అల్పపీడనంతో నిండు కుండలను తలపిస్తున్నాయి.
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జరిగే గణేష్ నిమజ్జనానికి సైతం నీటి కరువు చూసిన ప్రజలు నేడు అదే కరువు వరద రూపంలోకి మారడం చూసి ఆశ్చర్యపోతున్నారు. నాడు నీటి కరువు కు బాబుని దోషిగా నిందించిన నేతలు, ఇప్పుడు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కూడా బాబే కారణం అంటూ కీర్తించగలరా.?
నిన్నటి వరకు శాంతంగా ఉన్న కృష్ణమ్మ నేడు నిండుకుండగా మారి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీనితో అధికారులు 10 వేల క్యూసెక్కుల మిగులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నీటి విడుదలతో వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు, అలాగే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక 2024 లో బుడమేరు ఉగ్రరూపం చూపడంతో విజయవాడ కొన్ని రోజుల పాటు వరద నీటిలో నానింది.
అటువంటి బుడమేరు సైతం ఇప్పుడు పూర్తి స్థాయి జలాశయంతో నిండుకుండా ను తలపిస్తుంది. దీనితో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక రాయలసీమ జిల్లాలు సైతం ఈ అల్పపీడనంతో నీటి కొరత నుంచి బయటపడింది.
అయితే రాష్ట్రంలో వర్షాలు పడక పోవడం, తద్వారా నీటి కరువు ఏర్పడం కానీ దండిగా వర్షాలు పడి జలాశయాలు నిండు కుండలుగా ఉండడానికి కానీ ఎవరు కారణం కారు. ప్రకృతి పరిణామాలలో వచ్చే మార్పులతో ఏర్పడే కరువు కు ఒకరిని దోషిగా చిత్రీకరించలేము, అలాగే వచ్చే వరదలను ఒకరిని బాధ్యుడిని చేయలేము. ఇకనైనా ప్రకృతిని రాజకీయాల నుంచి మినహాయిస్తే మేలేమో..!
BOTTOM LINE A Toothless, Dull Missing-Child Thriller PLATFORM NETFLIX RUNTIME 4Hrs 25Mins [7 Episodes] What…
The trailer of Pooja Meri Jaan is out and presents a disturbing story in which…