మురుగదాస్ ‘అకిరా’ ట్రైలర్ ఎలా ఉంది?

Akira Trailer, Akira Trailer Talk,Akira Trailer Teaser,Akira Trailer Release, Akira Trailer Sonakshi Sinha, Akira Trailer AR Murugadossత్వరలో ప్రిన్స్ మహేష్ బాబు సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండడంతో, ప్రస్తుతం మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి సినీ వర్గాలలో నెలకొని ఉంది. దానికి ఈ తమిళ దర్శకుడు ఇచ్చిన సమాధానమే ‘అకిరా’ ట్రైలర్. సెప్టెంబర్ 2వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ‘అకిరా’ ట్రైలర్లో సోనాక్షి సిన్హా చేసిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తున్నాయి.

ట్రైలర్ మొదట నుండి చివరి వరకు కట్ చేసిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది. అమాయక అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి, ఒక్కసారే ఫైటింగ్ చేసిన సన్నివేశాలు ఆకర్షిస్తాయి. బొద్దుగా ఉండే సోనాక్షి నుండి ఈ తరహా సినిమాలు అభిమానులు కూడా ఆశించినవి కావు. ఈ సినిమా కోసం సోనాక్షి బాగా కష్టపడినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అయితే కధ మాత్రం రొటీన్ మెలో డ్రామాగా ఉందంటూ వీక్షకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ADVERTISEMENT

తమిళ సినిమా “మౌనగురు”కు ఇది పక్కా రీమేక్ అంటూ డిక్లేర్ చేసేసారు. 2011లో విడుదలైన ఈ సినిమాకు విమర్శకులు పట్టాభిషేకం చేసారు. ఇదే సినిమాను తెలుగులో గతేడాది ‘శంకర’ అనే పేరుతో డబ్ కూడా చేసారు. అదే కధకు మరికొన్ని యాక్షన్ హంగులు అద్ది మురుగదాస్ బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ అయితే పాస్ మార్కులు వేయించుకుంది గానీ, సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories