
చిన్నా పెద్దా ఎవరైనా సరే తన స్థాయితో సంబంధం లేకుండా డైరెక్టర్ అనేవాడు హిట్టు కొట్టాలనే స్క్రిప్ట్ రాస్తాడు. సినిమా తీస్తాడు. చాలాసార్లు లెక్క తప్పుతాయి. అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ఆచార్య డిజాస్టర్ రిజల్ట్ వచ్చాక కొరటాల శివ చెప్పింది చేశామని చిరంజీవి అన్నారు. నేను ముందో అవుట్ ఫుట్ ఇచ్చాను తర్వాత ఆయన మార్చమన్నందుకే తేడా కొట్టిందని తాజాగా మణిశర్మ సెలవిచ్చారు. రామ్ చరణ్ ఏకంగా నేషనల్ మీడియా ముందు ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన మూవీని ఎవరూ పట్టించుకోలేదని దాని గురించి తెలియని వాళ్లకు కూడా ఆచార్య ఒకటుందని గుర్తు చేసి మరీ హింట్ ఇచ్చాడు.
ఇవన్నీ కొరటాల పేరుని డ్యామేజ్ చేసేవే. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు ఆఖరిసారి కాబోదు. వినయ విధేయ రామ గల్లంతయ్యాక చరణ్ ఇచ్చిన సారీ నోట్ మర్చిపోకూడదు. మృగరాజు టైంలో గుణశేఖర్ ని అందరూ ఎత్తి చూపారు కానీ రచనలో భాగమైన నాగబాబు, యండమూరి, సత్యానంద్ తదితరులు గుర్తురాలేదు. భాయ్ పోయినప్పుడు నాగార్జున నింద మొత్తం వీరభద్రం మీదకు నెట్టేశారు. బ్రహ్మోత్సవం దెబ్బకు శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ కనిపించలేదు. నారప్ప కలర్ జిరాక్స్ తీయడానికి సురేష్ బాబు పిలిపిస్తే తప్ప బయటికి రాలేదు. వీళ్ళు అజ్ఞాతవాసి ఇచ్చినా వెంటనే స్టార్ సపోర్ట్ దక్కే త్రివిక్రమ్ లాగా బలమైన బ్యాకప్ ఉన్నవాళ్లు కాదు.
ప్రభాస్ రెబెల్ వచ్చినప్పుడు లారెన్స్ మీద పెద్ద దుమారమే రేగింది. ఒక్క మగాడు వల్ల వైవిఎస్ చౌదరి ఇప్పటికీ కోలుకోలేకపోయారు. షాడో, శక్తి దెబ్బ మెహర్ రమేష్ కి అందరినీ దూరం చేసింది. ఐకానిక్ సినిమా మాయాబజార్ తీసిన కెవి రెడ్డినే ఉమాచండి గౌరీశంకరుల కథ లాంటి అట్టర్ ఫ్లాప్ తీస్తే ఆయన మీద నింద వేసిన పత్రికలున్నాయి.ఇలా చెప్పుకుంటూ పోతే వందల్లో ఉదాహరణలు ఉన్నాయి కానీ సబ్జెక్టు ఏదైనా ఎలాంటిదైనా ఒప్పుకోవడం దగ్గరి నుంచి రైటో రాంగో అది హీరో నిర్మాత దగ్గరి నుంచి అందరి ప్రమేయం మొదలవుతుంది. గెలిచినా ఓడినా అది దర్శకుడికే అధిక శాతం దక్కుతుంది కానీ నిందించడం వరకు సబబే అయితే మరీ చరిత్రలో ఎవరూ ఫ్లాపులు ఇవ్వలేదన్నంత దారుణంగా పదే పదే చేయడం కరెక్ట్ కాదుగా.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…