
సినిమా హీరోలు చాలా అరుదుగా వేరే సినిమాలని రికమెండ్ చేయడమో లేక మినీ రివ్యూ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. అందులో మహేష్ బాబు ఎప్పుడూ ముందువరుసలో ఉంటాడు. తనకు నచ్చితే చాలు ఏ సినిమాకైనా రివ్యూ పెట్టి టీమ్ ని ఎంకరేజ్ చేస్తుంటాడు.
మహేష్ రివ్యూల్లో బాగా హేట్రెడ్ వచ్చిన ఏకైక రివ్యూ “మేం ఫేమస్” మాత్రమే. అది ఆబ్లిగేషన్ కోసం వేశాడని, డార్క్ లాంటి క్లిష్టమైన సిరీస్ కి కూడా సింపుల్ రివ్యూలు ఇచ్చిన మహేష్ కి ఆ సినిమా ఎలా నచ్చిందని మహేష్ అభిమానులే తిట్టుకున్నారు అప్పట్లో.
ఇప్పుడు నాని విషయంలోనూ ఇంచుమించుగా అదే జరుగుతోంది. “జై భీమ్”కి నేషనల్ అవార్డ్ రానందుకు నాని పోస్ట్ పెట్టాడని సోషల్ మీడియా అతడ్ని ఆడుకుంది. ఇప్పుడు రీసెంట్ గా “మృత్యుంజయ్, డెకాయిట్” సినిమాలకి బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు ఇచ్చాడని ట్రోల్ చేస్తున్నారు కొందరు.
ఈ విషయంలో నాని ఫ్యాన్స్ కాస్త గట్టిగానే సపోర్ట్ చేస్తున్నప్పటికీ.. నాని రివ్యూలు ఇచ్చిన సినిమాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడమో లేక బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడకపోవడమో వంటివి ఆ రివ్యూలకి ఎలాంటి వెల్యూ లేకుండా చేస్తున్నాయి.
అయితే.. ఇండస్ట్రీలో అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ, అజాతశతృవుగా వ్యవహరించే నానికి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయని, వాటికోసం నాని రంగంలోకి దిగి సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు.
కాకపోతే.. ఈ రివ్యూలు నాని క్రెడిబిలిటీని ఎఫెక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. “కోర్ట్” సినిమాకి జనాలు థియేటర్లకి వచ్చారంటే ఏకైక కారణం నాని ఇచ్చిన స్టేట్మెంట్. అది వర్కవుట్ అయ్యింది కాబట్టి, నాని మీద నమ్మకం, బాధ్యత పెరిగాయి.
ఇలా ఆబ్లిగేషన్స్ కోసం అన్నిసార్లు ఆ క్రెడిబిలిటీని వాడేస్తే మాత్రం.. భవిష్యత్తులో తన సొంత సినిమాల విషయంలో కూడా నాని చెప్పింది ఆడియన్స్ నమ్మకపోవచ్చు. సో, నాని రివ్యూలు కాస్త ఆచితూచి ఇవ్వాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…