
“అర్జున్ రెడ్డి చిత్ర యూనిట్ కి నేనిచ్చే సలహా.. మీ సినిమాలో మొదటి నుంచి చివర దాకా ఉన్న ముద్దు సీన్లు అన్నింటినీ కట్ చేసి ఒక పెన్ డ్రైవ్ లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన గదిలో ఒక్కరే చూసుకుని తప్పకుండా చిల్ అవుతారు” అంటూ తనదైన శైలిలో వీహెచ్ పై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అర్జున్ రెడ్డి’ సినిమాను మరోసారి చూశాను… మన సినీ పరిశ్రమలో లియోనార్డో డికాప్రియో విజయ్ దేవరకొండ అని చెప్పేందుకు నాకు ఎటువంటి అనుమానం లేదు.
ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న స్టాండర్డ్స్ లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ స్టార్ డమ్ ను విజయ్ దేవరకొండ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఇతర నటీనటులు చేసిన సంప్రదాయక సినిమాలకు భిన్నంగా డికాప్రియో ఎటువంటి హాలీవుడ్ సినిమాలైతే చేసి మార్పు తీసుకువచ్చాడో విజయ్ కూడా అదే విధంగా చేయాలి. నాన్ కన్వెన్షనల్, నాన్ ఫార్మాలిక్ చిత్రాలు చేయడం వల్లే డికాప్రియో సూపర్ స్టార్ కావడం వెనుక ఉన్న వాస్తవం’ అని వర్మ పేర్కొంటూ మరోసారి ‘అర్జున్ రెడ్డి’ని ఆకాశానికేత్తేసాడు.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…