
‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయం తర్వాత తెలంగాణా ‘మెగాస్టార్’గా విజయ్ దేవరకొండ అవతరించాడంటూ వర్మ చేసిన ప్రశంసలు తెలిసినవే. అయితే అప్పట్లో మరి అతిశయోక్తులతో వర్మ కామెంట్స్ చేస్తున్నాడంటూ కొందరు అభిమానులు విరుచుకుపడ్డారు. అయితే రాను రాను వర్మ చేసిన వ్యాఖ్యలే నిజమనిపించే విధంగా విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ముఖ్యంగా నేటి యూత్ విజయ్ ను ఒక ‘మెగాస్టార్’గా చూస్తున్నారని అర్ధమవుతోంది.
బహుశా పెద్ద పెద్ద స్టార్లకు కూడా ఈ రేంజ్ లో హంగామా చేయరేమో గానీ, ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తర్వాత యువతరం అంతా విజయ్ దేవరకొండ పేరును స్మరిస్తూ ఉంటున్నారు. తాజాగా రోడ్డుపై విజయ్ దేవరకొండ గడ్డంతో ఉన్న స్టిల్ ను గీసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. విజయ్ ను ప్రింట్ గుద్ధినట్లుగా దింపేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అనేది… ఊహించదగినదే..!
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…