Telugu

అర్జున్ సురవరంకు ఆ ఎడ్వాంటేజ్ ఉంటుందా?

చాలా నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన నిఖిల్ అర్జున్ సురవరం సినిమా మొత్తానికి ఈ రోజు విడుదల అయ్యింది. దానితో పాటు రాజా వారు రాణి గారు అనే చిన్న సినిమా, ధనుష్ నటించిన తూటా అనే డబ్బింగ్ సినిమా కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అన్నిటికంటే అర్జున్ సురవరంకు బెటర్ టాక్ వచ్చింది.

సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ చాలా వరకు ప్రేక్షకులను కథలో లీనం చేశారు. హీరో, విలన్ ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంది. అయితే సినిమాలో సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం మైనస్ అనే చెప్పుకోవాలి. మల్టీప్లెక్స్, ఏ సెంటర్ ఆడియన్స్ సినిమాను ఆదరించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

ఈ మధ్య కాలంలో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. ప్రేక్షకులు సరైన సినిమా కోసం వేచి చూస్తున్నారు. వారిని థియేటర్లకు రప్పించడానికి ఈ టాక్ సరిపోతుందా అనేది చూడాలి. అది అర్జున్ సురవరంకు ఎడ్వాంటేజ్అనే చెప్పుకోవాలి. వరుస వాయిదాల వల్ల సినిమా మీద కొంత నిర్లిప్తత అయితే ఉంది ఈ తరుణంలో సినిమా టీం గట్టిగా ప్రమోట్ చెయ్యాలి.

నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రం తమిళ సినిమా కానితన్ రీమేక్. ఆ దర్శకుడు సంతోష్ ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసాడు. ఈ కథ ఫోర్జరీ, దొంగ సర్టిఫికెట్ల బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. నిఖిల్ చాలా కాలంగా వేచి చూస్తున్న విజయం ఈ సినిమా తో దక్కుతుందేమో చూడాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

92,000 Jobs Gone: Indian IT Is Crumbling?

Artificial intelligence is having a significant impact on the global job market, with its effects…

25 minutes ago

ఎవరి బాబు నీళ్ళవి? నిజమే ఎవరి బాబువి కావు!

తెలంగాణలో కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో బీఆర్ఎస్‌ పార్టీ నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నామస్మరణ…

1 hour ago