
‘హాయ్’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ప్రధమ కుమారుడు ఆర్యన్ రాజేష్ ను రామ్ చరణ్ కు సోదరుడిగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. హీరోగా సక్సెస్ కాలేకపోయిన ఆర్యన్ రాజేష్, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఒకటి, రెండు సినిమాలలో ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకున్నప్పటికీ, ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదు. దీంతో బోయపాటి సినిమా రూపంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నాడన్న మాట.
‘లెజెండ్’ సినిమాతో హీరో జగపతిబాబుకు విలన్ గా సూపర్ హిట్ అందించి, జగపతి కెరీర్ ను మలుపు తిప్పిన బోయపాటి, ఈ సినిమాతో ఆర్యన్ రాజేష్ కెరీర్ కు కూడా బాటలు వేస్తారేమో చూడాలి. అది కూడా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో కావల్సినంత ఫోకస్ కూడా ఆర్యన్ కు దక్కుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే క్యారెక్టర్ రోల్స్ ను చేయడానికి ఆర్యన్ కు మరిన్ని అవకాశాలు చిక్కినట్లే భావించవచ్చు. ఆర్యన్ సోదరుడు అల్లరి నరేష్ కు కూడా, ప్రస్తుతం హీరోగా సక్సెస్ లు లేవన్న విషయం తెలిసిందే.
Shivangi Verma raises the fashion bar with a striking ethnic look that blends timeless elegance…
Kollywood film Anbe Diana starring Pari Elavazhagan in the lead and directed by him, was…