
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది మరియు ఉమెన్స్ డే వేడుకలు ఏప్రిల్ 13న మిల్వాకీ, విస్కాన్సిన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరయ్యారు. మన ఊరిలో పండగల్ని ఏ విధంగా జరుపుకుంటామో, అలాగే ఈ వేడుకను ATA విస్కాన్సిన్ సభ్యులు — కళ్యాణ్(మనబడి), ఈశ్వర్, శరత్, ఓమ్ని రెడ్డి, సింధు, సంతోషి, పావని, శ్రావణి, జీవిత, లోహిమ, మనోజారెడ్డి అడ్డి — ఎంతో సృజనాత్మకంగా మరియు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
విస్కాన్సిన్ మహిళా కోర్ కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ATA ప్రెసిడెంట్ జయంత్ చల్ల గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరై, అందరికి ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపున అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరించారు.
పిల్లలు మరియు పెద్దలు ఆట పాటలతో సందడి చేశారు. భార్యాభర్తల రాంప్ వాక్ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందచేశారు. శంకర్ నేత్రాలయ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. వేడుకలో రుచికరమైన వంటకాలను ఆటా సభ్యులు కలిసి స్వయంగా తయారు చేయటం విశేషం.
నిర్వాహకులు పోలిరెడ్డి గంట మరియు చంద్రమౌళి సరస్వతి , ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించిన లోకల్ ఆర్గనైజేషన్స్, జయంత్ పార, రాజబాబు నేతి మరియు ఇతర సబ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేసారు. స్పాన్సర్లకు ATA తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేసారు.
భోజన ఏర్పాట్లకు సహకరించిన ప్రవీణ్ డాడీ, వెంకట్ జలారి, శరత్ పువ్వాడి, గోపాల్ నారాయణస్వామి, కరుణాకర్ రెడ్డి దాసరి, చంద్రశేఖర్ తంగెళ్ల, అనుదీప్ నల్లమోతు, శ్రీనివాస్ నిమ్మన, రాజు పుల, సందీప్ అరికేరి, గోపాల్ సింగ్, సాయికిరణ్ పిడుగు, అవినాష్ సేలం, పూర్ణా మడాల వంటి వారు ఎంతో శ్రమించారు. కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ATA మిత్రబృందం — జగదీష్ బాదం, మహేష్ బేల, రత్నాకర్ రెడ్డి గద్వాల్, అవినాష్ రెడ్డి కుందూరు, విక్రాంత్ రెడ్డి కుందూరు, ఉత్కర్ష రెడ్డి అడ్డి, హేమంత్ కొమ్మి, రంజిత్ ఎర్రబెల్లి, పాండు, చంద్రిక, అర్జున్ సత్యవరపు, సురేష్ బెస్తి, విజయ్ వల్లూరి, లీల, చండీ ప్రసాద్, యష్మిత్ యెర్రా, నాసర్ రెడ్డి గంట — అందరికీ ధన్యవాదాలు. ఫోటోలు మరియు వీడియోలు తీసిన కృపాకర్‌కు, స్టాల్స్ పెట్టిన హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ యాజమాన్యానికి, గాయత్రి ఫుడ్స్ రాజు గారికి, శంకర్ నేత్రాలయ ట్రస్ట్, వ్రాచియోలియా లేబుల్స్, సఖియా స్టూడియోస్, లక్ష్మిరెడ్డి షోర్ వెస్ట్ రియల్ టర్స్ , గంగోత్రి నాన్-వెజ్ పికిల్స్, క్రిన పటేల్ రియల్ టర్స్, NIC info tek, అవినాష్ ఫోటో బూత్ దాతలకూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…