
ట్రైలర్ ఆద్యంతం కమల్ ‘విశ్వరూపమే’ కనిపించింది. ముఖ్యంగా హాస్పిటల్ స్ట్రెచర్ మీద కమల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అయితే ఆయన నటనకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. కమల్ మినహాయిస్తే, జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉండగా, ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి. ఆలస్యం అయినా అద్భుతమైన సినిమాను కమల్ అందిస్తున్నాడని ఆశిద్దాం.
తెలుగులో ఈ ట్రైలర్ ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసారు. రిలీజ్ కు ఒక గంట ముందే ట్రైలర్ చూసిన ఎన్టీఆర్, దీనిని కొనియాడుతూ ఓ ట్వీట్ కూడా ప్రత్యేకంగా చేసారు. ఇక తమిళంలో కమల్ తనయురాలు శృతిహాసన్ విడుదల చేయగా, హిందీలో మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
Unemployment had been one of the major concerns in the Indian society for a really…
India Women beat Zimbabwe by eight wickets in the third ODI to win the series…