
టిడిపి, జనసేనలు ఈ వేధింపులను, దౌర్జన్యాలను తట్టుకొని ఇంకా ఎంతకాలం నిలబడగలవో తెలీదు కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పక తప్పదు. బిజెపి నేత విష్ణుకుమార్ రాజు సైతం రాష్ట్రంలో ఈ అరాచక పరిస్థితులను సహించలేక తమ అధిష్టానం నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో రోడ్ షో నిర్వహిస్తుండగా హటాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఆయన వాహనం చుట్టూ చాలా మంది జనం ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు నాయుడు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ రక్షణగా నిలబడ్డారు. కరెంట్ పోగానే ఆ చీకటిలో ఎవరో చంద్రబాబు నాయుడుపైకి రాళ్ళు విసిరారు. వాటిలో ఒకటి చంద్రబాబు నాయుడు భద్రతాధికారి మధుబాబుకి గాయం అయ్యింది.
ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “వైసీపీ గూండాల్లారా దమ్ముంటే ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడండి. అంతే కానీ పులిచింతల ఫ్యాక్షన్ రాజకీయాలు నా దగ్గర చేయొద్దు… లైట్లు ఆర్పేసి చీకట్లో దొంగచాటుగా రాళ్ళు విసరడానికి సిగ్గనిపించడం లేదా? ఇటువంటి దాడులకు భయపడేవాడిని కాను నేను. నా చుట్టూ వందల మంది పోలీసులను కాపలా పెట్టారు. కానీ ఏం ప్రయోజనం?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…