
ఇక ఏటీఎంలలో వెతకడం వల్ల ఫలితం లేదని భావించి, స్వైపింగ్ మెషీన్లు ఉన్న పలు షాపుల్లో కార్డు స్వైప్ చేసుకొని నగదు ఇవ్వమని పలువురిని కోరింది. చేతిలో డబ్బులు లేవని, అకౌంట్లో డబ్బులున్నాయని సమాధానం చెబుతున్నారు… మరోవైపు ఇంటర్వ్యూ సమయం దగ్గరపడుతోంది… ఎలాగరా దేవుడా..! అనుకుంటున్న సమయంలో ఆమెను ఏటీఎంలు, షాపులకు తిప్పుతున్న ఆటో డ్రైవర్ బాబా.. ఆమె దగ్గరికి వచ్చి తన దగ్గరున్న 3000 రూపాయలను ఆమె చేతిలో పెట్టి…
“మేడమ్ మీరు వీటిని వాడుకోండి, హోటల్ కు వెళ్లాక తిరిగి ఇవ్వండి. ఏం పర్వాలేదు” అన్నాడు. దీంతో ఎంతో టెన్షన్ లో ఉన్న వరిజశ్రీ హాయిగా ఊపిరి పీల్చుకుంది. దీంతో తన పని ముగిసిన తరువాత అతనితో సెల్పీ దిగి “ఆటోడ్రైవర్ పేరు బాబా, ఆయన గొప్ప మనసు నన్ను కదిలించింది. నేను బాబాకు ఎంతో రుణపడి ఉంటాను” అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టి సెల్ఫీని పోస్టు చేసింది. ఇది కాస్త వైరల్ గా మారి, నెటిజన్ల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ప్రస్తుతం బాబా కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయాడు.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…