Telugu

టీజర్ టాక్ – కధే హీరో… అదే టైటిల్..!

ఒక్కో సమయంలో ఒక్కొక్కరి టైం నడుస్తుందని అంటారు. బహుశా గత రెండేళ్లుగా ‘నాచురల్ స్టార్’ నాని టైం నడుస్తుందో ఏమో గానీ, ‘పట్టిందల్లా బంగారం’ అవుతోంది. హీరోగా వరుసగా హిట్లు హిట్లు మీద హిట్లు కొడుతూ… ఏకంగా ట్రిపుల్ హ్యాట్రిక్ కు సిద్ధమైన నాని, తాజాగా నిర్మాతగా కూడా బోణీ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. “అ!” అనే టైటిల్ పెట్టి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా చేస్తోన్న పబ్లిసిటీ, ఈ టీజర్ తో పతాక స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు.

ఏదైనా కొత్తగా ఉంటే చెప్పొచ్చు కదా అని రవితేజ స్వరంతో చెప్పగా… అయితే ఈ టీజర్ చూడు అంటూ నాని గొంతు వినిపించగానే కనిపించిన షాట్స్ ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించగా, చివరకు హీరో ఎవరూ అంటూ రవితేజ అడగడం, కధే హీరో అని చెప్పగానే… “అ!” అంటూ రవితేజ సౌండింగ్ ఇవ్వడంతో, అదే టైటిల్ అంటూ నాని చెప్పిన విధానం… ఫస్ట్ ఇంప్రెషన్ లోనే నాని నిర్మాతగా కూడా అందరినీ పడేసాడని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. రాబిన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఈ టీజర్ కు స్పెషల్ అట్రాక్షన్.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Toxic: Sumalatha Has One Message for Yash

Yash’s Toxic has been getting mixed reactions since its release, but the actor is finding…

13 minutes ago

Inside Talk: Sajjala Really Beat Vijaya Sai Reddy?

The YSR Congress top leadership is absolutely rattled by the recent developments concerning Vijaya Sai…

44 minutes ago