
ఉదాహరణకు గుంటూరులో ఈ చిన్న ముచ్చట గురించి చెప్పుకోవచ్చు. వైసీపీ ఎంపీ అయోధ్యా రామిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాళీ గిరిధర్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, నలుగురూ నగర మేయర్, కమీషనర్లతో సమావేశమైనప్పుడు నగరంలో ఏం పనులు జరుగుతున్నాయో తనకు తెలీదని ఎమ్మెల్యేలు చెప్పిన్నట్లు తెలుస్తోంది. కనుక అధికారులు తమకు ఆ జాబితాను అందిస్తే పనులు జరుగుతున్నాయో లేదో తెలుసుకోగలుగుతామని చెప్పారు.
తాము అడుగుతున్న పనులను అధికారులు చేయడం లేదని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆరోపించగా, కొందరు కార్పొరేటర్లు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మరికొందరు పనుల కోసం అధికారుల వద్దకు వస్తే పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మద్దాళీ గిరిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే వారు పనులు ఎందుకు చేస్తారని కమీషనర్ను నిలదీశారు.
ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎడమొహం పెడమొహం పెట్టుకొని తిరుగుతుంటే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కనుక ఇద్దరూ కలిసికట్టుగా ఉంటూ నగర మేయర్, కమీషనర్లకు సహకరించాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి వారికి హితవు చెప్పారు.
ఇదీ పరిస్థితి! ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్, కమీషనర్ ఇంతమంది ఉన్నా వారి మద్య సయోధ్య లేదు. గుంటూరులో ఎక్కడ ఏం పనులు చేయాలో… ఏం పనులు జరుగుతున్నాయో ఎవరికీ పూర్తి అవగాహన లేదు. పైగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడంలేదని ఎమ్మెల్యే కమీషనర్ను నిలదీస్తున్నారు!ప్రభుత్వం పనులకు సరిపడా నిధులు మంజూరు చేస్తే ఎందుకు చెల్లించరు?కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే పనులు ఎలా జరుగుతాయి?
ఒక్క గుంటూరులోనే కాదు… రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, నియోజకవర్గాలలో ఇంచుమించు ఇదే పరిస్థితి. నేటి నుంచి ‘జగనన్నకు చెపుదాం’ అనుకొంటున్నారు కనుక వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులే ముందుగా ఇవన్నీ జగనన్నకు చెప్పొచ్చు కదా?
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…