
బిజూ మీనన్ పాత్రకు బాలయ్య కోసం ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పుడు రానా, రవితేజలతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రానికి స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మను అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర పేరు కూడా వినిపిస్తుంది.
అధికారిక ప్రకటన వచ్చేదాకా దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం రాజీపడని ఇద్దరు అహంభావం గల వ్యక్తుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది. తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. తొందరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. మలయాళంలో సక్సెస్ అయిన ఈ చిత్రంలో మిగతా భాషలలో ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అనేది చూడాలి.
పాలకులు అవినీతికి పాల్పడుతుంటే ఆ దేశం, రాష్ట్రాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. అదే.. రాజకీయ పార్టీలు నైతిక విలువలు వదిలేస్తే,…
Social media is breeding ground for trolls and wild stuff and it has been the…