Telugu

ఈ స్థానిక మంటలతో చలి కాగాలనుకుంటే…

పాలకులు అవినీతికి పాల్పడుతుంటే ఆ దేశం, రాష్ట్రాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. అదే.. రాజకీయ పార్టీలు నైతిక విలువలు వదిలేస్తే, దానికి అవే మూల్యం చెల్లించుకుంటాయి.

ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ పాలకులు అవినీతికి పాల్పడినందుకు గాను ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకు పోగా, ఆ భారం సామాన్య ప్రజలకు బదిలీ అవుతోంది.

ADVERTISEMENT

రాజకీయ పార్టీలు నైతిక విలువలు వదిలేస్తే ఏమవుతుందో అర్థం చేసుకునేందుకు, వివేకా హత్య ఒక అతిపెద్ద ఉదాహరణ కాగా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ, జనసేన, వైసీపీలు ఎదుర్కొంటున్న సంకట పరిస్థితులు మరో నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థలు దేనినీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో వాటినే ఆశ్రయించి రక్షణ పొందాలనుకోవడం విడ్డూరం.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల కమీషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ఏవిధంగా వ్యవహరించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు అది తప్పుగా అనిపించలేదు. చాలా గొప్పగా అనిపించింది.

కానీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని గగ్గోలు పెడుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందువల్ల? అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగాన్ని ధిక్కరించి ఇష్టారాజ్యం చేయడం వల్లనే.

రాజకీయ మదంతో నైతిక విలువలను తుంగలో తొక్కడం వల్లనే నేడు ఈ దుస్థితి అంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. ఒకవేళ నాడు వైసీపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించి ఉండి ఉంటే? అని ఆలోచిస్తే అర్థమవుతుంది.

ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో చెదురుమదురు ఘటనలు తప్ప ఇంత విధ్వంసం జరిగేది కాదు. కానీ ఇప్పుడు జరుగుతోంది. రాజకీయాలలో నైతిక పతనానికి ఇది కళ్ళెదుట కనిపిస్తున్న నిదర్శనం కాదా?

కనుక అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరిస్తూ ఉంటే, ఇతరులు కూడా వాటిని జవ దాటే సాహసం చేయరు. అప్పుడు రాజకీయాలు పద్దతిగా జరుగుతుంటాయి.

కానీ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా మేము దేనికీ కట్టుబడి ఉండమని వైసీపీ అనుకుంటే అధికారంలో ఉన్నవారు చేతులు ముడుచుకొని కూర్చోరు కదా?

కనుక నైతిక విలువలు వదిలేసినందుకు అన్ని పార్టీలు, వాటి నేతలు, కార్యకర్తలు అందరూ ఇప్పుడు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు కదా? రాజకీయాలలో ఇలాగే ఒక్కో మెట్టు దిగుతూ పోతే ఇలాంటి విధ్వంసాలు, భౌతిక దాడులు, హత్యలు అన్నీ ఈ ప్రక్రియలో భాగమైపోతాయి. అప్పుడు చింతించి ప్రయోజనం ఉండదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Brutal Trolls, Image Killed, But NTR Silent!

Social media is breeding ground for trolls and wild stuff and it has been the…

24 minutes ago

Finally, Charan Can Trust Sukumar, But…

After having worked with legendary Rajamouli for RRR, Ram Charan made some questionable choices with…

54 minutes ago