
రెండు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం థియేటర్లను ఈ ‘బాహుబలి 2’ తాకనుండగా, తమకు ఇంకా టికెట్లు దొరకనే లేదని అత్యధికులు వాపోతున్నారు. ఆన్ లైన్లో టికెట్లను విడుదల చేయగానే క్షణాల వ్యవధిలో బ్రోకర్లు వాటిని బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రీమియర్ షో టికెట్ల ధర ఏకంగా 2 వేల నుంచి 3 వేల వరకూ పలుకుతున్నట్టు తెలుస్తోంది. 10 శాతం టికెట్లను మాత్రమే ఆన్ లైన్లో విక్రయానికి ఉంచుతున్న థియేటర్ యాజమాన్యాలు, మిగతా టికెట్లను బ్లాక్ చేస్తున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.
మరోవైపు టికెట్లు దొరకని వారు తమకు తెలిసిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల సహాయాన్ని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి ప్రీమియర్ షో ఏప్రిల్ 27న (గురువారం) సాయంత్రం ఓవర్సీస్ లో పడనుంది. అయితే ఇప్పటికే ఓ ప్రీమియర్ షో పడిపోయిందని, దానికి సంబంధించిన స్టిల్ ఇదని ‘బాహుబలి-2’ సినిమా టైటిల్ తో పాటు, ప్రభాస్ స్టిల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతవరకు టీజర్ లో కాని, సాంగ్ ప్రోమోస్ లలో కానీ ఈ స్టిల్ కనిపించకపోవడంతో… ప్రివ్యూలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, లీకుల పర్వం మొదలైందని వార్త హల్చల్ చేస్తోంది.
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు.…
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…