
అయితే ఎంతో ఆసక్తితో క్లిక్ చేసిన ఈ వీడియోను చూసిన వారు ముందుగా నవ్వుకుంటున్నారు. మరి అంతలా నవ్వించేది ‘బాహుబలి’లో ఏముంది? అనుకుంటున్నారా? ‘బాహుబలి’లో ఏమీ లేదు గానీ, ఆ సినిమాను వినియోగించుకుంటూ రూపొందించిన వీడియోలో మాత్రం ఉందని చెప్పవచ్చు. ‘బాహుబలి పార్ట్ 1’లో ఉన్న రమ్యకృష్ణ సన్నివేశాలను ఎరువుల యాడ్ కు వాడుకుంటూ కట్ చేసిన ఈ వీడియో నెటిజన్లలో కామెడీని పండిస్తోంది.
నిజానికి ఈ వీడియో గత పది రోజుల క్రితమే పోస్ట్ చేయగా, సినిమా విడుదల సమయం దగ్గర పడడంతో ఇది మరింతగా వైరల్ గా మారింది. ‘బాహుబలి’ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్న ఈ వీడియోకు కూడా వేల సంఖ్యలో క్లిక్స్ రావడం విశేషం. సినిమా విడుదలకు ముందు పరిస్థితి ఇలా ఉంటే, విడుదలైన తర్వాత ఇంకెన్ని వీడియోలు పుట్టుకొస్తాయో చూడాలి.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…