
‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సినిమా పైరసీపై చిత్ర యూనిట్ ముందుగానే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేగంగా స్పందించిన పోలీసులు దానిని తొలగించి, ఈ 50 నిమిషాల నిడివి సినిమాను ఎవరు లీక్ చేశారన్నది కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే బెనిఫిట్ షో సమయంలోనే దీనిని షూట్ చేసి, ఆన్ లైన్ లో పెట్టారని గుర్తించారు.
ఈ లీక్డ్ వీడియోకు డౌన్ లోడ్ సౌకర్యం కూడా కల్పించడంతో దీనిని చాలా మంది డౌన్ లోడ్ చేసుకున్నారని సైబర్ క్రైం విభాగం అనుమానిస్తోంది. దీనిని వాట్స్ యాప్ లో ఎంత మంది షేర్ చేసుకుంటారోనని చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. అయితే మొన్నటి వరకు తమిళులు ఈ లీకుల పర్వం మొదలుపెట్టగా, సినిమా విడుదలకు ముందే తెలుగు వర్షన్ అందుబాటులోకి రావడం మాత్రం పెద్ద ట్విస్ట్ గానే పరిగణించాలి.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…