
మొదటి పార్ట్ కు అదిరిపోయే స్పందన రావడంతో, ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమాకు మరిన్ని బంపర్ ఆఫర్లు వస్తున్నాయని ట్రేడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించి ఇప్పటికీ చర్చలు జరిగాయని, బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత శాటిలైట్ మరియు ధియేటర్ హక్కులకు గానూ దాదాపు 150 కోట్ల భారీ ఆఫర్ ను నిర్మాత ముందుంచినట్లు తెలుస్తోంది.
అయితే కరణ్ జోహార్ ను కాదని, మరొకరికి ‘బాహుబలి 2’ హక్కులు ఇచ్చే ఉద్దేశంలో చిత్రయూనిట్ లేదని సమాచారం. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి ఈ విషయంలో ఒప్పుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా విజయవంతం కావడానికి కరణ్ జోహర్ అందించిన కృషి మరువలేనిదని, అందుకని, సదరు నిర్మాతకు ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ వెనక్కి పంపించేసారట.
అయితే ఇంత భారీ మొత్తం ఆఫర్ బయటకు రావడంతో ‘బాహుబలి 2’పై బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉందని అర్థమవుతోంది. ఒక తెలుగు సినిమాకు బాలీవుడ్ వర్గం ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం సంతోషించదగ్గ విషయమే. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ‘బాహుబలి 2’ ఉంటుందని ఆశిద్దాం.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…