
శివగామి రమ్యకృష్ణ ఒడిలో ఆడుకున్న పసికందుగా, అలాగే ఆమె ప్రాణత్యాగం చేయడంతో బతికిన బాహుబలిగా కనిపించిన ఆ శిశువు ఎవరు? అనే అంశం గతంలో హల్చల్ చేయగా, తాజాగా మరోసారి ఇదే అంశంపై సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ‘సిసింద్రీ’ సినిమాలో నటించిన అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ లా… ‘బాహుబలి’ సినిమాలో నటించిన ఈ చిన్నారి బాహుబలి కూడా ఎవరయినా స్టార్ కుమారుడేనా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో ఆ చిన్నారి ‘బాహుబలి’గా కనిపించింది అక్షర అనే ఓ పాప.
బాహుబలి సినిమా షూటింగ్ కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద జరుగుతుండగా, ఆ ప్రాంతంలోని అంగన్ వాడీ ప్రాంతానికి చెందిన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ‘బాహుబలి’ కోసం పనిచేస్తున్న సమయంలోనే అతడికి అప్పుడే ఈ పాప జన్మించింది. అక్షర అని నామకరణం చేసిన ఈ పాప, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరినీ పసికందులుగా చూపించినప్పుడు కనిపిస్తుంది. నిజంగా ఈ శిశువుని చూపించకుండా మొదట గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నారట.
అయితే దర్శకధీరుడు రాజమౌళి మాత్రం బేబీ అక్షరను ‘బాహుబలి’గా చూపిద్దాం అని ఫిక్స్ కావడంతో ఆ పాప పుట్టిన కొన్ని రోజులకే ‘బాహుబలి’లో కనిపించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలో నటించే సమయానికి ఆ పాప అక్షర వయసు కేవలం 18 రోజులు మాత్రమే. అయితేనేం… ఇండియన్ సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సృష్టిస్తున్న ప్రభంజనంలో ఈ చిన్నారి కూడా తన వంతు పాత్ర పోషించింది. బహుశా పెరిగి పెద్దయితే… జీవితకాలం పాటు తను గర్వంగా చెప్పుకునే విషయంగా నిలబడిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.
Amit Shah main target was Revanth Reddy and, through him, Rahul Gandhi. The “RR Tax”…
BOTTOM LINE Decent Family Drama, Shaky Fantasy PLATFORM JioHotstar RUNTIME 4 Hours 30 Mins (8…