Telugu

”డియర్ మేఘ” చిత్రంలో సిధ్ శ్రీరామ్ పాడిన ‘బాగుంది ఈ కాలమే’ లిరికల్ సాంగ్ రిలీజ్

మ్యూజికల్ హిట్ దిశగా ”డియర్ మేఘ” అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలోని
పాటలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఛాట్ బస్టర్స్ అవుతున్నాయి. ఇటీవల విడుదల
‘ఆమని ఉంటే పక్కన’ పాట 2 మిలియన్ వ్యూస్ కు పైగా క్రాస్ చేయగా…తాజాగా
సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘బాగుంది ఈ కాలమే’ లిరికల్ సాంగ్ ను రిలీజ్
చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఈ పాట లాంఛ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా
సూపర్ హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సిధ్ శ్రీరామ్. ఆయన పాడితే
మిలియన్ల వ్యూస్ గ్యారంటీ అనేంత పేరొచ్చిందీ యువ గాయకుడికి. ‘బాగుంది ఈ
కాలమే’ పాటను కూడా అద్భుతంగా పాడారు సిధ్ శ్రీరామ్.

ఊరికే ఇంత కాలం ఉంటున్నా…ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా..వెన్నెలే ఒంటి మీద
వాలేనా..తారలేమో కంటిలోన ఈదేనా…ఒక్కటై, చేరగా..దిక్కులే మారెనా..దూరమే
పోయెనా, వేదనే తీరెనా…బాగుంది ఈ కాలమే, బంధించి దాచెయనా..అంటూ అమేజింగ్
లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ పాటను
రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మంచి లవ్ ఫీల్ ఉన్న ట్యూన్ చేశారు.

ADVERTISEMENT

”డియర్ మేఘ” చిత్రంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో
హీరోయిన్స్ గా నటించారు. మనసును తాకే ప్రేమ కథగా ఈ సినిమాను
రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’
పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన ”డియర్ మేఘ” చిత్రం అతి త్వరలో
థియేటర్ లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ –
ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, ప్రొడక్షన్ కంట్రోలర్ – నాగ
మధు, పీఆర్వో – జీఎస్కే మీడియా. నిర్మాత – అర్జున్ దాస్యన్, రచన,
దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Thaman Could’ve Helped Vijay D A Lot?

Vijay Devarakonda has arrived in the theatres again with his latest film Ranabaali. This film…

24 minutes ago

Ranabaali Sequel: Rahul Sankrityan Ignoring Box Office?

Vijay Deverakonda’s Ranabaali is running with mixed talk and trying to sustain its collections in…

55 minutes ago