‘బాజీరావు’ ముందు చిన్నబోయిన ‘బాహుబలి’

తెలుగు సినీ చరిత్రతో పాటు ఇండియన్ కలెక్షన్స్ రికార్డులను తిరగరాసిన “బాహుబలి” చిత్రంపై ప్రశంసలు ఏ స్థాయిలో వచ్చాయో విమర్శలు కూడా అదే స్థాయిలో వినపడ్డాయి. అయితే, తెలుగు సినిమా వరకు సాంకేతిక పరంగా ఒక మెట్టు పైకి తీసుకువెళ్ళిన ‘బాహుబలి’ సినిమాను ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తున్న బాలీవుడ్ మూవీ ‘బాజీరావు మస్తానీ’ సినిమాతో పోలుస్తున్నారు.

కథాంశం పరంగా రెండు చిత్రాలు వేర్వేరు అయినప్పటికీ మేకింగ్ విధానంతో పోలిస్తే ‘బాహుబలి’ని మించిన స్థాయిలో ‘బాజీరావు మస్తానీ’ ఉందన్నది బాలీవుడ్ విమర్శకులు తేల్చిన అంశం. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఎంతో గ్రాండ్ గా ఉందన్న ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే తొలి ఫైట్ సన్నివేశం ‘బాహుబలి’ పోరాటాల కంటే కూడా బాగా చిత్రీకరించారనే టాక్ ను సొంతం చేసుకుంది.

రన్వీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాల అభినయంతో “బాజీరావు మస్తానీ”కి ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా దాసోహం అన్నారు. ఈ సినిమాకు లభించిన ‘సూపర్’ టాక్ తో హిందీతో పాటు తెలుగులో కూడా మంచి వసూళ్ళనే రాబడుతోందని ట్రేడ్ వర్గీయులు అభిప్రాయ పడుతున్నారు.

Share
Published by

Recent Posts

Sai Dharam Tej Engaged To Kiran, First Picture Out

Sai Dharam Tej, also known as Sai Durgha Tej, got engaged to his girlfriend Kiran…

22 minutes ago

Will OTT Offer Some Relief to Dulquer Salmaan’s Flop?

Dulquer Salmaan's high budget fantasy action film I'm Game directed by Nahas Hidhayath, was released…

42 minutes ago