Telugu

బి, సి సెంటర్స్… ఊపిరి పీల్చుకోండి ఇప్పుడే!

కరోనా సెకండ్ వేవ్ తర్వాత బి,సి సెంటర్లకు సరైన సినిమా పడకపోవడంతో, విలవిలలాడుతున్న బి,సి ధియేటర్లన్నీ డిసెంబర్ 2వ తేదీ నుండి కళకళలాడేలా “అఖండ” ధియేటిరికల్ ట్రైలర్ ఉంది. బాలకృష్ణ – బోయపాటిల కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ ‘అఖండ’ సింగిల్ స్క్రీన్స్ ను ఒక ఊపు ఊపేలా ఉంటుందన్న అనుభూతిని ట్రైలర్ కలిగించింది.

కరోనాకు ముందు వరకు ఒక వర్గం ప్రేక్షకులతో మినిమం కలెక్షన్స్ అందుకునే సెంటర్లుగా బి,సి విభాగాలకు మంచి మార్కెట్ ఉండేది. కానీ పాండమిక్ పీరియడ్ తర్వాత ఈ వర్గం ప్రేక్షకులను ధియేటర్ల వరకు తీసుకువచ్చే సినిమా ఇప్పటివరకు రాలేదు. ఆ భర్తీని పూర్తిగా తీర్చేసి, మాంచి ఆకలితో ఉన్న మాస్ ప్రేక్షకులకు కనులవిందు కలిగించేలా “అఖండ” ట్రైలర్ ను కట్ చేసారు.

ADVERTISEMENT

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ ట్రైలర్ లో… బోయపాటి మార్క్ టేకింగ్ కు తోడు బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్… థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్… రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ… టోటల్ గా “అఖండ” ఓ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.

ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచిన బాలయ్య డైలాగ్స్…

1) హేయ్… అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా… పట్టిసీమ తుమా… పిల్ల కాలువ…
2) ఒక మాట నువ్వంటే అది శబ్దం… అదే మాట నేనంటే శాశనం… దైవ శాసనం…
3) ఒక సారి డిసైడ్ అయి బరిలోకి దూరితే బ్రేకులు లేని బుల్డోజర్ ని… తొక్కి పారదొబ్బుతా….
4) లెఫ్ట్ రైటా టాపా బాటమా… ఎటు నుండి ఎక్కుపెట్టి గోకినా… కొడకా… ఇంచ్ బాడీ దొరకదు…
5) మీకు సమస్య వస్తే దండం పెడతారు… మేము ఆ సమస్యకే పిండం పెడతాం… బోత్ ఆర్ నాట్ సేమ్..!

శ్రీకాంత్ విలన్ గా నటిస్తోన్న “అఖండ” ట్రైలర్ ప్రేక్షకుల కోసం…

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by
Tags: cross link

Recent Posts

Prabhas-Rajamouli Record in Danger? SRK Next in Line?

Avengers Endgame is proving that a film does not always need a new release to…

6 minutes ago

Netflix’s Much Hyped Film: Why Bollywood Fans Offended?

Netflix’s Best of the Best arrived on September 18 with an interesting premise: a Hollywood…

36 minutes ago