
గెటప్ మరియు యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అలాగే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బాలయ్య మాడ్యులేషన్లో ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కాపాలం పగిలిపోద్ది’ అనే డైలాగ్ బాలయ్య అభిమానులను పించెక్కించింది. ఈ టీజర్ చిత్రంపై ఉన్న హైప్ అలాగే అంచనాలను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు.
మే 28 న విడుదలకే తాము ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ తిరిగి ధృవీకరించారు. దీనితో అదే తేదీని టార్గెట్ చేస్తున్న రవితేజ ఖిలాడి ఏమవుతుందో చూడాలి. ఈ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో రవితేజ సినిమా మీద ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ పోటీ గురించి పక్కనపెడితే అసలు అప్పటి కరోనా పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో అనేది అసలు విషయం.
మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. అతను గతంలో బోయపాటి యొక్క జయ జానకీ నాయకను నిర్మించాడు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణా సినిమాలో కథానాయికలు. 2018లో వచ్చిన జైసింహా తరువాత బలయ్య కు సరైన హిట్ అనేది లేదు. పైగా వరుసగా మూడు ప్లాపులు మూటగట్టుకున్నాడు. దానితో ఈ సినిమా విషయంలో అతని మీద చాలా ఒత్తిడి ఉంది.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…