
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది గనుక ఇటువంటి సినిమా తీయడం రిస్క్ అని మొత్తానికి విరమించుకున్నారట. గతంలో వీరిద్దరి కంబినేషన్ లో వచ్చిన జై సింహ జస్ట్ యావరేజ్ సినిమా. దీనితో ఈ వార్తలతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలయ్య ఇచ్చిన మాట తప్పను అంటూ కేఎస్ రవికుమార్ తో కథ మార్చి మరీ సినిమా చేస్తున్నాడని తాజా సమాచారం. ఆ సినిమా 12న ముహూర్తం చేసుకుని నెలాఖరుకు సెట్స్ మీదకు వెళ్తుందట.
ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం తప్పకపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2019లో ఇప్పటివరకు బాలయ్యకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ సంవత్సరం వచ్చిన ఎన్టీఆర్ చిత్రం రెండు భాగాలు బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అదే సమయంలో బాలయ్య హిందూపురం నుండి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా బాలయ్య తన 2014 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం విశేషం.
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…
Miloni Jhonsa walks into these frames like she knows the camera is hooked. Draped in…