‘ఎన్టీఆర్’కు అసలు సిసలు వారసుడు ‘బాలకృష్ణ’ ఒక్కరే!

ఊహించినదంతా జరుగుతోంది… “డిక్టేటర్” ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక ప్రారంభమైన కొద్దిసేపటికే, ఈ వేడుక ఏర్పాటు వెనుక ‘ఉద్దేశం’ ఏమిటో యాంకర్ ఝాన్సీ ద్వారా తెలిసిపోయింది. నందమూరి వంశానికి అందగాడు “NBK” ఒక్కరేనని, తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాదు, ఆయన రాజనీతిని కూడా కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ వారసత్వానికి అసలు సిసలు వారసుడు ‘నందమూరి బాలకృష్ణ’ ఒక్కరేనని యాంకర్ ఝాన్సీ పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

బాలయ్యను పొగిడే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారో లేక ఉద్దేశపూర్వకంగా యాంకర్ పలికారో గానీ, వర్తమానంగా ఏర్పడిన పరిణామాలు మాత్రం… ఎన్టీఆర్ వారసుడు బాలయ్య మాత్రమేనని ప్లాటినం డిస్క్ వేడుక స్పష్టం చేస్తోంది. అలాగే బాలయ్యపై వేసిన ‘ఏవి వీడియో’లో కూడా బాలయ్య మాత్రమే వారసుడు అని పలు సందర్భాలలో ప్రస్తావించడం గమనించదగ్గ విషయమే.

సాధారణంగా బాలకృష్ణ వేడుకల్లో యాంకర్లు ఏది పడితే అది మాట్లాడానికి అవకాశం ఉండదు. ప్రతి అక్షరం అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది. మరి ముందస్తు సమాచారం లేకుండానే ఝాన్సీ ఈ వ్యాఖ్యలు చేసిందంటే నమ్మశక్యమేనా?

Share
Published by

Recent Posts

చట్ట సభలు కాస్త వీధి పోరాటాలుగా మారుతున్నాయా.?

నానాటికి అసెంబ్లీ సమావేశాల అర్ధం మారుతూపోతుంది. ఒకప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి అధికార - విపక్షాల మధ్య జరిగే చర్చలకు వేదికైన…

4 minutes ago

AK47: Dasara Release Plans Take an Interesting Turn

AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…

17 minutes ago