
కొరటాల నెక్స్ట్ సినిమా దేవర2 అనుకుని రీసెంట్ గానే ఎన్టీఆర్ అభిమానులందరూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసారు. కట్ చేస్తే కొరటాల తన తదుపరి సినిమా బాలయ్యతో చేస్తున్నాడనే కన్ఫర్మేషన్ వచ్చింది.
నిజానికి సింహా సినిమా కథ-మాటలు-స్క్రీన్ ప్లేలో కొరటాల హస్తం ఉందనే విషయం చాలామందికి తెలిసిందే. అప్పటినుంచే బాలయ్యతో కొరటాలకి మంచి ర్యాపో ఉంది. అయితే మిర్చి తర్వాత కొరటాలతో సినిమా కోసం అందరు యంగ్ హీరోలు క్యూ కట్టడంతో.. “ఆచార్య” వరకు అందరూ యంగ్ హీరోస్ తోనే వర్క్ చేశాడు కొరటాల.
ఎట్టకేలకు బాలయ్యతో సినిమా అనౌన్స్ అయ్యేసరికి.. బాలయ్య మాస్ యాంగిల్ కి కొరటాల సెన్సిబిలిటీ సింక్ అయితే సరికొత్త బాలయ్యను చూస్తాం అనే ఆశ రేగింది. అయితే.. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో తమన్ పేరు వినిపిస్తుండడం మాత్రం కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ అండ్ సినిమా అభిమానుల్ని నిరాశకు గురి చేసింది.
కొరటాల ఇప్పటివరకు తమన్ తో పని చేయలేదు. ఆచార్య ముందు వరకు దేవిశ్రీప్రసాద్ తోనే వర్క్ చేశాడు, అన్నీ మంచి ఆల్బమ్స్. తర్వాత మణిశర్మతో వర్క్ చేశాడు కానీ.. అభిమానులు ఆశించే స్థాయి చార్ట్ బస్టర్స్ దొరకలేదు. తర్వాత “దేవర”తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి కూడా రీచ్ అయ్యే ఆల్బమ్ ని అనిరుధ్ ద్వారా అందుకున్నాడు.
మరోపక్క తమన్ వర్క్ బాగా రొటీన్ అయిపోయింది. డాకు మహరాజ్ లో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ అయ్యింది కానీ పాటలు ఎవరికీ పెద్దగా గుర్తులేవు. ఓజీ తప్ప రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గ ఆల్బమ్ ఏదీ తమన్ నుంచి రాలేదు. రీసెంట్ హా వచ్చిన “కొరియన్ కనకరాజు” ఫస్ట్ సింగిల్ కూడా ఆకట్టుకోలేకపోయింది.
అన్నిటికీ మించి బాలయ్య – థమన్ అనగానే ఫ్రెష్ కాంబినేషన్ అనే వైబ్ ఉండదు, మళ్ళా అదే లౌడ్ మ్యూజిక్, బిజీమ్ అనే ఫీల్ వచ్చేస్తది, ఇది బాలయ్య – కొరటాల ఫ్రెష్ కాంబినేషన్ అనే దానిపై కూడా ఇంపాక్ట్ పడక మానదు.
ఇలాంటి తరుణంలో మోస్ట్ ఎవైటెడ్ బాలయ్య-కొరటాల కాంబినేషన్ కి రొటీన్ థమన్ నే ఫిక్స్ చేస్తారా లేదా ఒక అడుగు ముందుకేసి మరో మ్యూజిక్ డైరెక్టర్ ని తెచ్చి ఎక్సైట్మెంట్ పెంచుతారా అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…