
మరి ఇలాంటి తరుణంలో ఒక సినిమా ఏకంగా మూడు సంవత్సరాల పాటు ప్రదర్శితమయ్యిందంటే ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? సగటు సామాన్య ప్రేక్షకుడు అయితే, ‘ఖచ్చితంగా సదరు సినిమాను బలవంతంగా ఆడిస్తున్నారన్న’ అభిప్రాయానికి వచ్చేస్తాడు. ప్రస్తుతం ‘లెజెండ్’ సినిమా విషయంలో జరుగుతోంది కూడా అదే. ఓ పక్కన కొత్త సినిమాలే పైరసీ బారిన పడి, ధియేటర్లకు రావట్లేదు అని గగ్గోలు పెడుతున్న తరుణంలో… పైరసీ పక్కన పెడితే, ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో సార్లు ప్రదర్శితం అవ్వడం ఒక అంశమైతే, 10 రూపాయలకే డివిడి లభ్యమవుతుండగా ఇంకా సినిమా హాలులో ఒక సినిమా ఏకంగా మూడేళ్ళ పాటు ఆడడం సాధ్యమేనా?
ఇవన్నీ ఒకెత్తు అయితే, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం రీత్యా, డబ్బులు చెల్లించకుండా యూ ట్యూబ్ మరియు ఆన్ లైన్ లలో అందుబాటులో ఉన్న సినిమాకు, డబ్బులు చెల్లించి మళ్ళీ మళ్ళీ సినిమాను చూస్తున్నారని చెప్తే అంతకు మించిన అవివేకం మరొకటి ఉండదు. మరి ఇంత తెలిసి కూడా ఎందుకు వ్యర్ధమైన రికార్డుల కోసం ప్రాకులాడడం? అంటే అది అర్ధం కాని పరిస్థితి. ఇలా ప్రతి రౌండ్ ఫిగర్ కు ‘లెజెండ్’ సినిమాపై పోస్టర్ విడుదల చేయనుండడం, అది హీరో గారికి ఇమేజ్ పెంచడం అటుంచితే, డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని నిర్మాతలు గ్రహించలేకపోతున్నట్లున్నారు.
ఒకప్పుడు ‘సింహాద్రి, ఠాగూర్’ తదితర సినిమాల విషయంలో… అత్యధిక సెంటర్ల రికార్డ్ ల కోసం పోటీపడి ఎక్కువ సెంటర్లలో 100 రోజులు, 175 రోజులు ఆడించి అబాసుపాలయ్యారు. అయితే రానూ రానూ ఆ సెంటర్ల యావ తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత కలెక్షన్స్ హవా మొదలైంది అనుకోండి, అది వేరే విషయం. మరి ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయిన రికార్డుల కోసం ‘లెజెండ్’ సినిమాను ఇంకా బలవంతంగా ఆడించడం ఏంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు.
ఇది నిర్మాతలు చేస్తున్న పనో లేక ధియేటర్ యాజమాన్యపు పనో, అదీ గాక మరే ఇతరుల వలన జరిగినా కూడా… అంతిమంగా మన తెలుగు ప్రేక్షకులు హీరో చూసే సినిమాకు వెళ్తారు గనుక, ఆ కీర్తి అయినా, అపకీర్తి అయినా బాలయ్య బాబుకే చెందుతోంది. అయితే ఈ 950 నుండి 1000 రోజుల పోస్టర్ మాత్రం అపకీర్తినే మూటకట్టుకుంటోంది. మరి ఈ విషయంలో బాలయ్య బాబైనా చొరవ తీసుకుని, ఇలాంటి బలవంతపు రికార్డుల కోసం ప్రయాస పడవద్దని చెప్తే బాగుంటుంది కదా..?!
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…