
భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026’ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ (జీవితకాల సాఫల్య) పురస్కారాన్ని అందజేశారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ అవార్డుతో సత్కరించారు.
దిల్లీలోని ‘భారత్ మండపం’ ఈ మెగా ఈవెంట్‌కు వేదికైంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో బాలకృష్ణతో పాటు ప్రముఖ అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరఫున కుటుంబసభ్యులు)ను కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించారు. ముఖ్యమంత్రి రేఖాగుప్తా చేతులమీదుగా వీరంతా అవార్డులు అందుకొన్నారు.
ఈ సందర్భంగా షర్మిలా ఠాగూర్ మాట్లాడుతూ.. వయసు పెరిగేకొద్దీ నటనలో మరింత స్వేచ్ఛ లభిస్తుందన్నారు. దిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలనచిత్ర ఉత్సవాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. వివిధ భాషా చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.
కోలీవుడ్ హీరో విజయ్ టీవీకే పార్టీతో తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలుచుకున్నప్పుడు జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు, పార్టీలో..…
The much-anticipated director Buchi Babu Sana is set to release Peddi on June 4th.…