Telugu

సరైన సమయంలో బాలయ్య స్పందించడం వల్ల సరిపోయింది

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఎట్టకేలకు విడుదల కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెల 22 న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా అతి త్వరలో విడుదలచేయనున్నారు. మొదటి పార్ట్, ఎన్టీఆర్ కథానాయకుడు ఫెయిల్యూర్ తో రెండవ భాగం ను ఎలాంటి హడావుడి లేకుండా విడుదలచేస్తున్నారు.

అయితే ఉన్నఫళంగా ఈరోజు ఆ చిత్రం గురించి నెగటివ్ వార్తలు హల్ చల్ చేశాయి. నష్టపోయిన బయర్లకు అండగా నిలబడటానికి బాలకృష్ణ ముందుకు రావడం లేదని దీనితో కథానాయకుడు బయర్లు మహానాయకుడికి దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ మీద గౌరవంతో పెట్టుబడి పెట్టిన వారిని నిండా ముంచారని విమర్శలు వచ్చాయి. దీనితో బాలయ్య ఒక్కసారిగా జాగ్రత్త పడ్డారు. బయర్లను పిలిచి మాట్లాడారు. సాయంత్రానికి విషయం సర్దుమణిగింది.

ADVERTISEMENT

కథానాయకుడు బయర్ల ద్వారానే మహానాయకుడు విడుదల చెయ్యాలని నిర్ణయించారు. కథానాయకుడు నష్టాలలో 33% వరకు బాలయ్య భరించడానికి ముందుకు వచ్చారు. అలాగే రెండవ పార్ట్, మహానాయకుడికి వచ్చే రెవిన్యూలలో 40% అదే బయర్లకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. దీనితో నష్టపోయిన వారు ఊపిరి పీల్చుకున్నారు. వారంతా బాలయ్య కు రుణపడి ఉంటాం అంటున్నారు. సరైన సమయంలో బాలయ్య స్పందించడం వల్ల సరిపోయింది గానీ లేకపోతే దీనిలో ఎన్టీఆర్ పేరు బద్నామ్ అయ్యేది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Yash’s Ramayana Connection Is Bigger Than Ravana

Yash is preparing to face audiences as Ravana in Ramayana, but his role in the…

13 minutes ago

ఏపీ టూరిజం స్పాట్ గా సూర్యలంక బీచ్…?

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొలమానాలు అంటే ఒకటి పారిశ్రామిక ప్రగతి మరొకటి ఆర్థిక పురోగతి. అయితే అందులో రెండవదైన ఆర్థిక పురోగతికి…

31 minutes ago