
ఇప్పుడు పవన్ భాగం మీద అంతకంతా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. టీజర్ గట్రా చూస్తుంటే కంటెంట్ గట్టిగానే కనిపిస్తోంది. అన్నయ్య చిరంజీవిలో నచ్చని నచ్చిన లక్షణాల గురించి చెప్పమని బాలయ్య అడగడం, ఇదే నా చివరి సినిమాని వదిన సురేఖతో పవన్ చెప్పిన పాత సంఘటన లాంటివి ఆసక్తికరంగా ఉన్నాయి. బాలా అని పిలవమని అడిగినా పవన్ ఓడిపోవడానికి సిద్ధమని ఒప్పేసుకోవడం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. ఈ మధ్య రాజకీయ విమర్శల్లో పవన్ పదును పెంచిన అంశం గురించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది.
అన్నిటికన్నా ముఖ్యమైనది కోట్లాది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా అదంతా ఓట్ల రూపంలోకి జనసేనకు అనుకూలంగా మారడం లేదనే ప్రశ్న బాలకృష్ణ అడగటం అందరి మనస్సులో ఉన్నదే. దానికి ఏం సమాధానం వచ్చి ఉంటుందా అనేది సస్పెన్స్ లో పెట్టేశారు. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ జనాల్లో ఆసక్తి పెరిగేలా ఈసారి బాగానే డిజైన్ చేశారు. వీ ఆర్ బ్యాడ్ బాయ్స్ అంటూ చివర్లో పవన్ బాలయ్య చేతులు కలిపేసుకుని వెళ్లడం వెరైటీగా ఉంది. ఎప్పుడనేది చెప్పలేదు కానీ కమింగ్ సూన్ అని ఊరించి వదిలేసింది ఆహా.
ఇప్పుడీ భాగం కోసం సినిమా ప్రియుల్లోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హైప్ ఉంది. పవన్ ఏం మాట్లాడితే దాన్ని పట్టేసుకుని ప్రెస్ మీట్లలో, బయట పబ్లిక్ ఉన్న చోట మైకుల్లో కౌంటర్లు ఇచ్చేందుకు తహతహలాడుతున్న మంత్రులు ఎంఎల్ఏలు రిలీజ్ కావడం ఆలస్యం చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. పవన్ ని భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ సినిమాలో కానీ బయట ఈవెంట్ లో చూసే అవకాశం దక్కలేదు. ఇప్పుడీ అన్ స్టాపబుల్ లో పర్సనల్ విషయాలు చాలా మాట్లాడబోతున్న నేపథ్యంలో స్ట్రీమింగ్ మొదలు కాగానే క్రాష్ కాకుండా ఆహా ముందే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…
The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…