“డిక్టేటర్” సస్పెన్స్ రివీల్ చేసిన బాలకృష్ణ!

ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతున్న “డిక్టేటర్” సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలే నెలకున్నాయి. ముఖ్యంగా సినిమాల మధ్య ఉన్న పోటీ వాతావరణంతో ‘డిక్టేటర్’ చిత్ర విశేషాలను సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే, లీక్ లతో సంబంధం లేకుండా సాక్షాత్తు నందమూరి నటసింహం బాలయ్య బాబే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమా కధలోని కొంత భాగాన్ని చెప్పేసారు.

“హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నించే అమ్మాయి పాత్రలో ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ కనిపించనుంది. డబ్బుకు సంబంధించిన విషయంలో సోనాల్ ఓ సారి రౌడీలకు చిక్కుకుంటుందని, ఆ సమయంలో హీరోయిన్ తన అండ కోరుతుందని, ఆమెకు విజిటింగ్ కార్డ్ ఇస్తానని వెల్లడించాడు. అయితే… విజిటింగ్ కార్డ్ ఇచ్చి తన ఇంటి కొచ్చి అప్పు తీర్చమంటాడు విలన్. ఈ నేపథ్యంలో సోనాల్ చౌహాన్ కిడ్నాప్ చేస్తారు విలన్ గ్యాంగ్. వాళ్ల అడ్రస్ ట్రేస్ చేయడానికి ముందు ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ఎలా ఉపయోగపడింది?” అనేది బాగా రసవత్తరంగా సాగుతుందని బాలయ్య బాబు వివరించారు.

సినిమాలోని ఆసక్తికరమైన సన్నివేశాలు చెప్పడం కేవలం సినిమా ప్రచారంలో భాగమేనా… అన్న రీతిలో అభిమానులు చర్చించుకుంటున్నారు. సాధారణంగా అగ్ర హీరోల సినిమాల స్టోరీలు విడుదలయ్యే వరకు బయటకు రానివ్వరు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా బాలయ్య చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “డిక్టేటర్” జనవరి 6వ తేదీన సెన్సార్ బోర్డును పలకరించనుంది.

Share
Published by

Recent Posts

కేసీఆర్ పాదయాత్ర…ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చెయ్యగలదా.?

కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…

18 minutes ago

Telangana Assembly Battle Ground: Protests & Injuries

Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…

20 minutes ago