
గీతం అధినేత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీలో పావులు కదుపుతున్నారని, ఒకవేళ తనకు అవకాశం లేని పక్షంలో తన మనవడైన బాలయ్య చిన్నల్లుడు భరత్ కు టికెట్ మంజూరీ చేసేలా పార్టీ నేతలను కోరినట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు గానీ, బాలకృష్ణ కూడా తన చిన్నల్లుడుని రాజకీయ రణరంగంలోకి దించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే పెద్దల్లుడు, సిఎం తనయుడు నారా లోకేష్ పార్టీలో సేవలు అందిస్తున్నందున, చిన్నల్లుడు కూడా అదే బాటలో పయనించాలని బాలయ్య ఆశిస్తున్నారట. ప్రస్తుతం విశాఖలో ఉన్న గంటా శ్రీనివాస్ ను లోక్ సభ నుండి బరిలోకి దింపాలని, గంటా స్థానంలో భరత్ ను బరిలోకి దింపాలని సాగుతున్న చర్చలు ఎంతవరకు కార్యరూపం సిద్ధించుకుంటాయో చూడాలి.
Vishwak Sen has asked children and people with weak hearts to stay away from his…
అధికార పార్టీ ఎమ్మెల్యే గా రేవంత్ సర్కార్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన వ్యాఖ్యలతో, రాజకీయ ప్రకటనలతో…