Telugu

జైలర్-2 లో బాలకృష్ణ గెస్ట్ రోల్

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా 2023లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటుల కామియోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్-2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కామియో రోల్‌లో కనిపించనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

‘జైలర్-2’ సినిమా షూటింగ్ 2025 మార్చిలో చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో రజనీకాంత్ ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ పాత్రలో మరోసారి కనిపించనున్నారు. అయితే, ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదటి ‘జైలర్’ సినిమాలోనూ బాలకృష్ణను కామియో రోల్ కోసం సంప్రదించారని నెల్సన్ స్వయంగా వెల్లడించారు. 2023లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “బాలకృష్ణ గారిని ఒక డెడ్లీ పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం అనుకున్నాను. కానీ, ఆ పాత్రను స్క్రిప్ట్‌లో సరిగ్గా ఫిట్ చేయలేకపోయాను. జైలర్-2లో ఆయన ఈ రోల్ చేస్తే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది” అని చెప్పారు. ఈసారి ఆ ఆలోచన వాస్తవ రూపం దాల్చినట్లు కనిపిస్తోంది. యాక్షన్‌తో నిండిన గెస్ట్ రోల్ అని సమాచారం.

ADVERTISEMENT

జైలర్ పార్ట్-1 లో తెలుగు నటులు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈసారి బాలకృష్ణ ఎంట్రీతో ఆ లోటు తీరనుంది. రజనీకాంత్, బాలకృష్ణ లాంటి ఇద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు స్క్రీన్ షేర్ చేస్తే అది థియేటర్లలో విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. అయితే, బాలకృష్ణ పాత్ర గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘జైలర్-2’ సినిమా 2025 చివరిలో లేదా 2026 ఏప్రిల్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం, విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. బాలకృష్ణ కామియో నిజమైతే, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది అనడంలో సందేహం లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

11 minutes ago

Is Rashmika Too Busy For Ranabaali? Vijay Explains

Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…

12 minutes ago