
ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ కాస్ట్ కటింగ్ చేసేస్తోంది చిత్ర బృందం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాకు పెట్టే ఖర్చు ఏదైనా ఉంటే బాలయ్య, బోయపాటిలకు ఇచ్చే రెమ్యూనరేషన్లు మాత్రమే అని చెప్పుకోవాలి. దీని బట్టి కాంబినేషన్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి సినిమాని తక్కువ ఖర్చులో చుట్టేస్తారా? అనే అనుమానం ఫ్యాన్స్ లో కూడా మొదలయ్యింది.
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత నిలిచిపోయింది. కరోనా కేసులు ఎప్పుడు తగ్గుతాయా అని బృందం వేచి చూస్తుంది. తగ్గిన వెంటనే వారు షూట్‌ను తిరిగి ప్రారంభిస్తారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో షూట్‌ను తిరిగి ప్రారంభించాలనేది ప్రణాళిక. ఈ సినిమా కోసం మోనార్క్ మరియు సూపర్ మాన్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని పుకార్లు ఉన్నాయి
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అభిమానుల హైప్‌కు అనుగుణంగా ఉంది. ఈ సినిమా కు తమన్ సంగీత స్వరకర్త. బోయపాటికి సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా కీలకం. అలాగే బాలయ్య కూడా గత ఏడాది వరుసగా మూడు ప్లాపులతో ఫ్యాన్స్ కు భాకీ ఉన్నాడు. సినిమా షూటింగ్ తొందరగా మొదలైతే సంక్రాంతి విడుదలకు ప్రయత్నిస్తారు. ఒకవేళ కుదరకపోతే సమ్మర్ కి వాయిదా పడొచ్చు.
Andhra Pradesh has seen what happens when political rivalry becomes a personal battle. From the…
Last week's attempted mass shooting at a Hindu temple in Aurora has left NRIs in…