
అల్లూరులో కవిత అనే మహిళను వైసీపీ నేతలు ఇంట్లో పెట్టి తాళం వేయగా, ఈ విషయం తెలుసుకొన్న టిడిపి, జనసేన పార్టీల మహిళా నేతలు తాళం పగులగొట్టి ఆమెకు బందవిముక్తి కల్పించారు. ఈ విషయం అన్ని ప్రధాన మీడియాలో ఫోటోలతో సహా వచ్చింది. కానీ ఆమెను తాను నిర్బందించమని చెప్పలేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒంగోలులో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీలోనే కొందరు నేతలు టిడిపి నేతలతో కుమ్మకై నాకు, నా కుమారుడికి వ్యతిరేకంగా ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దామాచర్ల జనార్ధన్, మంత్రి శ్రీను అనే మరొకతను అల్లూరులోని మహిళను నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి మాట్లాడించినట్లు నా దగ్గర ఆధారాలున్నాయి.
ఒంగోలులోని సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిని కూడా మా పార్టీలోనే కొందరు రెచ్చగొట్టి నాపైకి ఉసిగొల్పారని నాకు తెలుసు. అతను మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించి నేను అతనితో మాట్లాడనని చెప్పి పంపేశాను. జనసేనకు చెందిన మహిళతో నేను మద్యం మత్తులో అసభ్యంగా మాట్లాడనని టీవీలో వచ్చిన వార్తలను నేను ఖండిస్తున్నాను. ఈ ఆరోపణపై నేను కాదు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి.
తమిళనాడులో పోలీసులు ఓ వ్యక్తి దగ్గర నుంచి భారీగా డబ్బు పట్టుకొంటే, దానినీ నాకు ముడిపెట్టి నేను హవాలా బిజినెస్ చేస్తున్నట్లు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ నన్ను, నా కుమారుడిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు మా పార్టీలోనే కొందరు చేస్తున్న కుట్రలు తప్ప వాటితో నాకు ఎటువంటి సంబందమూ లేదు.
నాపై చేసిన ఈ ఆరోపణలలో ఏ ఒక్కటి నిజమని రుజువు చేసినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకొంటాను. కనుక పార్టీలో నాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నవారు ఇకనైనా తమ తీరు మార్చుకోకపోతే నేను వారి వివరాలను బహిర్గతం చేసి సిఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తాను.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…