Telugu

హిందూ ముస్లిం.. పాకిస్తాన్… బీజేపీ జీహెచ్ఎంసి మంత్రం

హిందూ ముస్లిం… తెరాస ఎంఐఎం చుట్టూనే తెలంగాణ బీజేపీ జీహెచ్ఎంసి కాంపెయిన్ నడుస్తుంది. ఇప్పటికే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుండగా… బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అదే రూట్ లో వెళ్తున్నారు.

ADVERTISEMENT

హబ్సిగూడలోని ఒక రోడ్ షోలో మాట్లాడుతూ… జీహెచ్ఎంసి ఎన్నికల తరువాత పాత బస్తీ పై తాము సర్జికల్ స్ట్రైక్ చెయ్యడం ఖాయమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. “అక్కడ అనధికారికంగా నివసిస్తున్న రోహింగ్యాలను, పాకిస్తాన్ కొడుకులను తరిమి తరిమి కొడతాం. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుంది,” అని సంజయ్ చెప్పుకొచ్చారు.

హిందూ ముస్లిం కార్డు మీద బీజేపీ చాలా ఆశలే పెట్టుకున్నట్టు ఉంది. గతంలో హిందూ ముస్లిం కార్డు మీద హైదరాబాద్ లో తరచు గొడవలు జరిగేయి. అయితే కొంతకాలంగా హైదరాబాద్ అవేమీ లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ వాటిని తెరమీదకు తెచ్చి రాజకీయంగా బలపడదామని బీజేపీ చూస్తున్నట్టుగా ఉంది.

అయితే ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. 4న ఫలితాలు వస్తాయి. ఒకరకంగా తెలంగాణ ఏర్పడిన తరువాత ఎదురు అనేది లేకుండా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి మొట్టమొదటి సారిగా ఇక్కడ బీజేపీ రూపంలో సవాలు ఎదురయ్యింది అనే చెప్పుకోవాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Ramayana’s Big Release Gets a Tax-Free Push

Ramayana has received a Big boost ahead of its theatrical release. As per the latest…

8 minutes ago

Was Tiger Shroff an Easier Target?

According to reports, the shooters may have initially planned to target Salman Khan but allegedly…

39 minutes ago