
తాజాగా వీటన్నింటికి బండ్ల గణేష్ బదులివ్వబోతున్నాడు. ఎస్వీ కృష్ణారెడ్డినే తనకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ కన్నీరు పర్యంతం అయిన నాటి నుండి ‘ప్లీజ్ ఆంటీ’ ఏదో ఒక సెక్స్ సినిమాలో హీరో క్యారెక్టర్ వరకు ఇండస్ట్రీలో అన్ని పనులను తానూ చేసానని నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు బండ్ల గణేష్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత రెండు సంవత్సరాలు అస్సలు పవన్ కళ్యాణ్ ను కలవలేదని చెప్పిన బండ్ల, దేవుడు అందించిన అరుదైన వ్యక్తులలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఒకరని అభిప్రాయపడ్డారు.
నా స్థాయి, స్టామినా వేరని, అవసరమైతే ఒక వారం రోజుల్లో ట్రంప్ దగ్గరికి వెళ్లి ఫోటో దిగి మీకు ఇస్తానని, ఈ నయీమ్, బొయీమ్ లతో వార్నింగ్ లాంటివన్నీ ఒట్టి పుకార్లేనని, నా మీద ఈగ వాలదు అంతే, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, బండ్ల గణేష్ మీద రెండవ యాంగిల్ మీకు ఎవరికీ తెలియదని ఒక రేంజ్ లో తన గురించి చెప్పుకున్నారు. ‘బాద్ షా’ సినిమాలో తనకు కొంత నష్టం వచ్చిన మాట వాస్తవమేనని, రవితేజను నేను మోసం చేసానని, అలాగే గొప్పగా చెప్పే ఓ దర్శకుడుతో పని చేసానని, పేరు చెప్తే అతని పొట్ట కొట్టిన వాడిని అవుతానని, రాత్రయితే మందు కొట్టేవాడని, అతనితో పనిచేయడం అసహ్యం వేసిందని… చెప్పుకొచ్చారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…