
ఇంకా చెప్పాలంటే… ‘కాటమరాయుడు’ ఆడియో వేడుక పైన పవన్ చేసిన రొటీన్ సుదీర్ఘ ప్రసంగం ఎంతమంది గుర్తు పెట్టుకున్నారో చెప్పలేం గానీ, బండ్ల గణేష్ మాట్లాడిన నాలుగు ముక్కలు మాత్రం ప్రతి ఒక్కరిని టచ్ చేశాయని చెప్పవచ్చు. బండ్ల గణేష్ మాట్లాడిన దాంట్లో ఎంత నిజం ఉంది? అన్న విషయం పక్కన పెడితే… ఆ మూడు, నాలుగు నిముషాల పాటు స్టేజ్ ను ఒక ఊపు ఊపి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ మాస్ డైలాగ్స్ తో అతిశయోక్తులు వినిపించే బండ్ల, ఈ సారి ప్రముఖ వ్యక్తులు చెప్పిన “క్వోట్స్”ను ప్రస్తావిస్తూ పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
దీంతో ఈ డైలాగ్స్ విన్న త్రివిక్రమ్ కూడా ‘ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు’ అన్న హావభావాలను పలికించారు. బండ్ల గణేష్ తర్వాత మాట్లాడిన త్రివిక్రమ్ కూడా, ఈ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. మరో విధంగా చెప్పాలంటే బండ్ల గణేష్ స్పీచ్ ముందు ‘మాటల మాంత్రికుడు’ ప్రసంగం తేలిపోయింది. నిజానికి బండ్ల గణేష్ లాంటి ప్రసంగం త్రివిక్రమ్ నుండి వస్తుందని అంతా ఊహించారు. ఎందుకంటే ఈ ఆడియో వేడుకకు త్రివిక్రమే చీఫ్ గెస్ట్. కానీ, త్రివిక్రమ్ కే సౌండ్ ఆఫ్ అయ్యేలా చేసాడు ఈ పవన్ అభిమాని.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…