Telugu

బెంగళూరు మ్యాచ్ లంటే ప్రేక్షకులకు పండగే!

ఐపీఎల్ సీజన్ 9 విభాగంలో భారీ స్కోర్లకు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లు నిలుస్తున్నాయి. టీ20 మ్యాచ్ ల నుండి ప్రేక్షకులు ఎలాంటి మజాను అయితే ఆశిస్తారో, సరిగ్గా అదే తరహా ఆటతీరుతో ఆకట్టుకోవడం బెంగళూరు జట్టు వంతవుతోంది. తొలి మ్యాచ్ లో 200పై చిలుకు పరుగులతో మోత మోగించిన బెంగళూరు జట్టు, ఆదివారం నాడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కూడా రెండు వందల పరుగుల మైలు రాయికి కొద్ది దూరంలో ఆగింది.

మరోసారి కోహ్లి, డివిలియర్స్ లు విరుచుకుపడడంతో ఒకానొక సమయంలో 220 పరుగులకు చేరుతుందన్న అంచనాలు వేసారు. అయితే ఢిల్లీ బౌలర్స్ చివరి 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి, క్రీజులో పాతుకుపోయిన వాట్సన్, కోహ్లిల వికెట్లను నేలకూల్చడంతో స్కోర్ 191 పరుగులకే పరిమితం అయ్యింది. అయినప్పటికీ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ADVERTISEMENT

ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ డీకాక్ 48 బంతుల్లో 108 పరుగులు, సెకండ్ డౌన్ బ్యాట్స్ మెన్ నాయర్ 42 బంతుల్లో 54 పరుగులు చేయడంతో, మ్యాచ్ 19.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, మ్యాచ్ ను సొంతం చేసుకుంది. మ్యాచ్ ఆద్యంతం ఫోర్లు, సిక్సర్లు మోత మోగడంతో మైదానంలో ప్రేక్షకులు, టీవీల ముందు వీక్షకుల పంట కూడా పండినట్లయ్యింది. అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించిన డీకాక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వశం కావడం ఒకటైతే, డీకాక్ అవుటైన సమయంలో ప్రత్యర్ధి జట్టు సభ్యులు కూడా చప్పట్లతో అభివాదాలు పలికారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Madhuri Rathod: Suicide Attempt, Police Under Fire?

Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…

50 minutes ago

ఏపీ కాంగ్రెస్‌.. రాజకీయ ఉద్యోగ కల్పనకు మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…

1 hour ago